Space programs: అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తోన్న విజయాలను చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. రాకెట్ సహా వాటి విడిభాగాలను సైకిల్, ఎడ్లబండిపై తీసుకెళ్లినప్పుడు కొన్ని దేశాలు మనల్ని చూసి నవ్వాయి. ఇప్పుడు అవే దేశాలు తక్కువ ఖర్చుతో తమ ఉపగ్రహాలను రోదసీలోకి ప్రవేశపెట్టమని ఇండియా వెంటపడుతున్నాయి. ఈ అవకాశాన్ని వ్యాపార కోణంలో చూడాలని ఇస్రో భావిస్తోంది.
భారత అంతరిక్ష రంగం 'క్లోజ్డ్' మరియు 'సీక్రెటివ్' సొసైటీ నుంచి ఓపెన్‌గా మారుతోందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. దీనిని కేవలం ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేయకుండా ఆర్థిక, వ్యాపార అవకాశంగా మలచాలని భావిస్తున్నట్లు చెప్పారు. అమెరికా వంటి దేశాల మాదిరిగా.. ఈ రంగం ద్వారా రెవెన్యూ జనరేట్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ 2024లో వెల్లడించారు.

గత 60 ఏళ్లలో అంతరిక్ష రంగం ద్వారా రాకెట్ల తయారీ నుంచి ఉపగ్రహాల వరకు సామాన్యులకు ఉపయోగపడే సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ వివరించారు. ఫలితంగా స్పేస్ ప్రోగ్రామ్స్ బడ్జెట్ చాలా తక్కువగా ఉంటున్నట్లు తెలిపారు. దానిని 10 రెట్లు పెంచాలనే లక్ష్యంతో దేశ అంతరిక్ష విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
రాకెట్లు మరియు ఉపగ్రహాల తయారీని ప్రైవేట్ రంగానికి అప్పగించడం సహా చంద్రయాన్, ఆదిత్య ఎల్ 1 మరియు గగన్‌యాన్ వంటి ఇస్రో పరిశోధన కార్యకలాపాలను పెంచడంపై దృష్టి పెట్టామన్నారు. ఇందులో భాగంగా బోయింగ్ వంటి పలు కంపెనీలతో చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. తద్వారా పలువురు కొత్త ప్లేయర్స్, స్టార్టప్స్, పరిశ్రమలు ఈ రంగంలోకి వచ్చేందుకు మార్గం సిద్ధం చేస్తున్నామన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications