Ship Hijack: ప్రాచీన కాలం నుంచి ఓడలపై బిజినెస్ చేయడం భారతీయులకు అలవాటే. ఇప్పటికీ వివిధ దేశాల మధ్య సరుకు రవాణా ఎక్కువగా జల మార్గం ద్వారానే జరుగుతోంది. అయితే ఓ పక్క హమాస్ పై భీకర దాడులు జరుపుతున్న వేళ.. సముద్ర గర్భంలో కొత్త తలనొప్పిని గుర్తించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇందులో భారత్ కూడా భాగం కావడం ఆందోళన కలిగిస్తోంది.
యెమెన్ ఆధారిత హౌతీ మిలిటెంట్ గ్రూప్ సోమవారం ఓ వీడియో ఫుటేజీని విడుదల చేసింది. అందులో ఆయుధాలు చేతబట్టిన కొందరు వ్యక్తులు హెలికాప్టర్ నుంచి ఓడపై దిగినట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ కు సంబంధించిన కార్గో షిప్ ఎర్ర సముద్రం మార్గంలో భారత్ కు వెళుతున్న సమయంలో హైజాక్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఫుటేజీని హౌతీస్ టీవీ ఛానెల్ అల్ మసీరా విడుదల చేసింది. అయితే వారు స్వాధీనం చేసుకున్న 'గెలాక్సీ లీడర్' షిప్ బ్రిటీష్ ఆధీనంలో ఉందని, జపాన్‌కు చెందినదని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ ఘటనను అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతకు సంబంధించిన 'ఇరానియన్ ఉగ్రవాద చర్య'గా అభివర్ణించింది. అయితే ఇజ్రాయెల్ కు చెందిన ఓడనే తాము స్వాధీనం చేసుకున్నట్లు హౌతీలు ధ్రువీకరించారు.
కొందరు మిలిటరీ సిబ్బంది చట్టవిరుద్ధంగా హెలికాప్టర్ ద్వారా తమ ఓడపై దిగినట్లు గెలాక్సీ లీడర్ యజమాని తెలిపారు. అనంతరం నౌకతో కమ్యూనికేషన్ నిలిచిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం అది యెమెన్ లోని హోడెయిడా ఓడరేవు ప్రాంతంలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్ కు చెందిన నౌకలే తమ లక్ష్యమని హౌతీలు స్పష్టం చేశారు.
'ఎర్ర సముద్రంలో జరిగిన ఈ ఘటన అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమే. ఓడతో పాటు దాని సిబ్బందిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. తదుపరి చర్యల కోసం మిత్రదేశాలతో కలిసి UN భాగస్వాములతో సంప్రదిస్తాము' అని US స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఓ ప్రకటనలో తెలిపారు.
More From GoodReturns

ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

Iran Israel war: యుద్ధాల్లో ఇరుక్కుపోయినప్పుడు ఏం చేయాలో తెలుసా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి విషయాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications