Campa Cola: ఇన్నాళ్లుగా ఇండియన్ ఆటగాడిగా ఉన్న ముఖేష్ అంబానీ ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ కావాలని చూస్తున్నారు. దీనికి తగిన ప్లానింగ్ కోసం ఇన్నాళ్లుగా పనిచేసిన వ్యాపారవేత్త పెద్ద ఆటకు సిద్ధమైనట్లు తాజా పరిణామాల ప్రకారం తెలుస్తోంది.
వాస్తవానికి బెవరేజెస్ వ్యాపారంలో కోకాకోలా, పెప్సికోలు ప్రపంచ మార్కెట్లను శాసిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరికి పోటీగా భారతీయ మార్కెట్లో క్యాంపా కోలాను ముఖేష్ అంబానీ ప్రస్తుతం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో తక్కువ ధరలకు క్యాంపా కోలా ఉత్పత్తులను విక్రయించటం ద్వారా అంతర్జాతీయ ఆటగాళ్ల ఆటలకు చెక్ పెట్టాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.

ఇదే క్రమంలో అంబానీ తన క్యాంపా కోలాను గల్ఫ్ దేశాలకు సైతం పరిచయం చేశారు. రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని ఇషా అంబానీ నిర్వహిస్తున్న వేళ భారీగా వ్యాపార విస్తరణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రిలయన్స్ గ్రూప్ క్యాంపా కోలా మెుదటి బ్యాచ్ బెహ్రైన్ లోని రిటైల్ దుకాణదారులకు మెుదటి లాట్ పంపించిందని వెల్లడైంది. రానున్న కాలంలో క్రమంగా ఇతర గల్ఫ్ దేశాల్లోను విక్రయాలను ప్రారంభించాలని కంపెనీ చూస్తోంది. ఒమన్, సౌదీ అరేబియా వంటి దేశాలకు వేసవి ముందే విస్తరించాలని అంబానీ ప్లాన్ చేస్తున్నారు.
అసలు ప్లాన్ ఇదే..!
సౌదీ అరేబియా, యూఏఈ వంటి కీలక మార్కెట్లలో స్థానిక బాట్లింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి రిలయన్స్ భాగస్వామ్యాలను అన్వేషిస్తోంది. అయితే తొలినాళ్లలో ఇండియా నుంచి క్యాంపా కోలా ఉత్పత్తులను ఎగుమతి చేయాలని నిర్ణయించింది. రానున్న కాలంలో భాగస్వాములు దొరికిన తర్వాత స్థానికంగా అక్కడే ఉత్పత్తిని ప్రారంభించటం ద్వారా కార్యకలాపాలు క్రమబద్ధీకరించాలని రిలయన్స్ గ్రూప్ భావిస్తోంది. దీని తర్వాత అక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు కూడా క్యాంపా కోలాను విస్తరించటం సులభతరంగా మారుతుందని అంబానీ భావిస్తున్నారు.
2023 రిలయన్స్ ఏజీఎం సమయంలో కంపెనీ ఎఫ్ఎంసీజీ వ్యాపారాన్ని ప్రపంచ దేశాలకు విస్తరించాలనే ప్రణాళికలను ఇషా అంబానీ స్టేక్ హోల్డర్లకు వివరించిన తర్వాత ప్రస్తుత చర్య వస్తోంది. అంతర్జాతీయ స్థాయికి క్యాంపా కోలాను విస్తరించాలనే తన కోరికను ఆమె అప్పుడే ప్రకటించారు. ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఉత్పత్తులను చేరువచేయాలని నిర్ణయించారు. కేవలం రూ.10కే పెట్ బాటిల్ ద్వారా కూల్ డ్రింక్స్ విక్రయించటంతో కంపెనీ దేశంలో మార్కెట్లను భారీగా ప్రభావితం చేసింది. దీనికి మధ్యప్రాశ్చంతో ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications