Isha-Mukesh Ambani: అంబానీ కొత్త డీల్.. తండ్రిని మించిపోయిన ఇషా అంబానీ..!!
Reliance Retail: ముఖేష్ అంబానీ తన రిటైల్ అండ్ ఫ్యాషన్ వ్యాపారాలను కుమార్తె ఇషా అంబానీకి అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే కంపెనీ వ్యాపారంలో పెద్ద మార్పుల మ్యాజిక్ కొనసాగుతోంది. ఇది కంపెనీ వ్యాల్యుయేషన్ ను భారీగా పెంచేస్తోంది. అమె కొత్తగా అనేక కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని రిలయన్స్ వ్యాపారాన్ని అత్యంత వేగంగా విస్తరిస్తూ తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకుంటోంది. ఈ క్రమంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.3 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
ఈ క్రమంలో ఇషా అంబానీ నేతృత్వంలోని కంపెనీ రిలయన్స్ రిటైల్ ఇజ్రాయెల్ ఆధారిత బ్రాండెడ్ ప్రైవేట్ లేబుల్ 'ఇన్నర్‌వేర్' కంపెనీ డెల్టా గలీల్ ఇండస్ట్రీస్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటును ప్రకటించింది. రిలయన్స్ రిటైల్ ఈ భాగస్వామ్యంతో గార్మెంట్ మార్కెట్‌లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. మహిళలు, పురుషులుతో పాటు పిల్లల కోసం వస్త్రాలను తయారు చేసే డెల్టా గలీల్‌తో ఈ భాగస్వామ్యంలో ఇరు సంస్థలు 50:50 శాతం వాటాను కలిగి ఉండనున్నాయి.

పార్ట్నర్‌షిప్ కింద డెల్టా గలీల్ రిలయన్స్ బ్రాండ్ కోసం ఉత్పత్తులను డిజైన్ చేసి తయారు చేయనుంది. ఈ జాయింట్ వెంచర్ రాబోయే 18 నెలల్లో డెల్టా ఫ్యామిలీ లైఫ్‌స్టైల్ స్టోర్‌లను, పురుషుల-మహిళల ఇన్నర్‌వేర్ కోసం ఎథీనా బ్రాండ్‌ను కూడా ప్రారంభించనుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లో తన ఉనికిని విస్తరించడానికి ఈ వెంచర్ దోహదపడనుందని రిలయన్స్ భావిస్తోంది. రిటైల్ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారుల కోసం ఈ ఉత్పత్తులను అందించటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ వి సుబ్రమణ్యం వెల్లడించారు.
జాయింట్ వెంచర్ డెల్టా గలీల్ లోతైన పరిశ్రమ నైపుణ్యం ఇన్నర్‌వేర్, యాక్టివ్‌వేర్‌లలో ఆవిష్కరణ సామర్థ్యాలను రిలయన్స్ రిటైల్ ప్రభావితం చేయడంలో సహాయపడుతుందని సీఈవో డెల్టా గలీల్ పేర్కొన్నారు. దీనికి ముందు బ్రిటిష్ పాదరక్షల కంపెనీ క్లార్క్స్‌తో రిలయన్స్ రిటైల్ రెండేళ్ల జాయింట్ వెంచర్ ముగిసింది. రిలయన్స్ రిటైల్ క్లార్క్స్ రిలయన్స్ ఫుట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. ఇరు సంస్థల మధ్య భాగస్వామ్య నిబంధనల్లో వచ్చిన విభేదాలే దీనికి కారణంగా వెల్లడైంది.


Click it and Unblock the Notifications