Nita Ambani: కూతురు ఇషా చేతిలో కొత్త ప్రాజెక్ట్ పెట్టిన నీతా అంబానీ.. పూర్తి వివరాలు..
Isha Ambani: దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. ఆయన భార్య నీతా అంబానీ ఎల్లప్పుడూ విద్య, యువత భవిష్యత్తుపై ఎక్కువ శ్రద్ధ చూపుతుంటారు.
తాజాగా నీతా అంబానీ తన కొత్త వెంచర్ ద్వారా దేశంలో ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్‌ను విస్తరించాలని చూస్తున్నారు. అయితే దీనికి నాయకత్వం వహించే బాధ్యతను కుమార్కె ఇషా అంబానీకి అప్పగించారు. నీతా ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్ - నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ ద్వారా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను విస్తరించనున్నట్లు 46వ ఏజీఎం సమావేశంలో ప్రకటించారు.

నా కుమార్తె ఇషా నేతృత్వంలో కొత్త పాఠశాల నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్స్ భారతీయ ఆత్మతో భవిష్యత్తులో ఒక మోడల్ స్కూల్‌గా భావించబడుతుందని తెలిపారు. ప్రస్తుతం రెండు దశాబ్ధాలుగా ప్రముఖులు, బాలీవుడ్ స్టార్స్ పిల్లల కోసం ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఒక టాప్ ఇన్‌స్టిట్యూట్ గా కొనసాగుతోంది.

రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ గా ఉన్న నీతా అంబానీ దీనిని ప్రారంభించారు. రిలయన్స్ ఫౌండేషన్ భవిష్యత్తు గురించి చర్చిస్తూ.. నీతా అంబానీ రాబోయే 10 ఏళ్లలో రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల ద్వారా 50,000 మంది విద్యార్థులకు సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది సంస్థ దాదాపు 5,000 మందికి స్కాలర్‌షిప్‌లను అందించింది. ఇషా అంబానీ దేశంలోని ప్రముఖ IB బోర్డ్ స్కూల్‌లలో ఒకటైన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కి వైస్ చైర్‌పర్సన్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇషా అంబానీ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతులు నిర్వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications