Reliance Retail: దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె అందించిన బాధ్యతలను మెరుగ్గా నిర్వహిస్తున్నారు. వివిధ వర్గాలను ఆకర్షించేందుకు అనేక బ్రాండ్లను ఇండియాకు తీసుకొచ్చారు. దేశంలో రిటైల్ వ్యాపార విస్తరణను ఆమె చాలా వేగంగా ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ దశలో రిలయన్స్ రిటైల్ తన దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తుల వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి థర్డ్ పార్టీ స్టోర్‌లలోకి విస్తరించాలని నిర్ణయించుకుంది. దీంతో దేశంలోని నలుమూలలకు తీసుకెళ్లాలని చురుకుగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కంపెనీ B2C విభాగంలో మాత్రమే విక్రయాలు జరుపుతోంది. అయితే తాజా నిర్ణయం ద్వారా B2B శ్రేణిలోకి అడుగుపెట్టాలని నిర్ణయించింది.

ఇషా అంబానీ తాజా వ్యూహం ద్వారా భారతదేశంలోని రిటైల్ దుకాణదారులు ఇప్పుడు రిలయన్స్ రిటైల్ నుంచి దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులను కొనుగోలు చేసి విక్రయించేందుకు వీలు కలుగుతుంది. రిలయన్స్ రిటైల్ ఇప్పటికే దాదాపు 50 సొంత బ్రాండ్లను కలిగి ఉంది. రానున్న కాలంలో వీటి సంఖ్యను 2-3 రెట్లు పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రిలయన్స్ తన సొంత ఉత్పత్తులను తన సొంత బ్రాండ్ స్టోర్లలో విక్రయించడం కంటే దేశ వ్యాప్తంగా రిటైలర్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం దేశంలో సబ్బులు, షాంపూలు ఎలా విక్రయించబడుతున్నాయో అదే విధంగా బట్టల విక్రయాలను జరపాలని రిలయన్స్ రిటైల్ చూస్తోంది. ఇప్పటి వరకు దేశంలోని ఏ ప్రధాన దుస్తులు బ్రాండ్ కూడా తన వ్యాపారాన్ని B2B విభాగంలో విక్రయాలు చేపట్టలేదు. అవి కేవలం ఏదో ఒక పద్దతిని మాత్రమే అనుకరిస్తున్నాయి. అయితే ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ మాత్రం B2C, B2B రెండు విభాగాల్లోనూ విజయం సాధించాలని చూస్తోంది. ఒకవేళ ఈ ప్లాన్ విజయవంతమైతే ఇది రాబోయే 5 ఏళ్లలో అత్యంత లాభదాయకమైన విభాగం అవనుంది.
ఈ B2B బిజినెస్ మోడల్ ప్రస్తుతం అజియో బిజినెస్ కింద పైలట్ ప్రోగ్రామ్‌గా అమలు చేయబడుతోంది. రిలయన్స్ రిటైల్‌లో సిల్క్‌ఫీట్, ఎక్స్‌లెరేట్, పాదరక్షల కోసం జివర్స్, స్పోర్ట్స్‌వేర్ కోసం అథ్లెజర్, మహిళల పాదరక్షల కోసం ఫీట్ అప్, భారతీయ సాంప్రదాయ దుస్తులకు అవాసా, మహిళల దుస్తులకు రివా, కిడ్లీబూ, టీ-షర్ట్ సెగ్మెంట్ కోసం ఆల్టెయిర్ వంటి 50కి పైగా బ్రాండ్‌లు ఉన్నాయి. అలాగే అనేక ప్రముఖ బ్రాండ్‌లతో టై-అప్‌లు, వ్యాపార పంపిణీని కలిగి ఉంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications