Mukesh-Isha Ambani: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన వ్యాపార బాధ్యతలను తర్వాతి తరం వారసులకు ఇప్పటికే అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇషా అంబానీ రిలయన్స్ గ్రూప్ వ్యాపారాల్లో కీలకమైన రిటైల్ వ్యాపారానికి బాధ్యత వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నేతృత్వంలో కంపెనీ అద్భుతాలను సృష్టిస్తోంది.
తాజాగా నాలుగున్నరేళ్ల తర్వాత చైనాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ షీన్ తిరిగి ఇండియాలోకి అడుగుపెడుతోంది. ఇషా అంబానీ నాయకత్వంలో కొనసాగుతున్న రిలయన్స్ రిటైల్ షీన్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవటంతో తిరిగి భారత మార్కెట్లోకి చైనా సంస్థ తన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. వాస్తవానికి కంపెనీ జూన్ 2020లో బ్లాక్ చేయబడిన సంగతి తెలిసిందే. అయితే దీని తర్వాత భారీగా గ్యాప్ తీసుకున్న కంపెనీ ప్రస్తుతం తిరిగి రిలయన్స్ కంపెనీతో జతకట్టి తిరిగి ఎంట్రీకి ప్లాన్ చేసింది.

వాస్తవానికి రిలయన్స్ ఫ్యాషన్ వ్యాపారం అజియో.కామ్‌లో దీనిని ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కంపెనీ క్యాజువల్ వెస్ట్రన్ వేర్ పై ప్రధానంగా ఫోకస్ చేయాలని నిర్ణయించింది. అయితే కంపెనీ ప్రస్తుతం భారతదేశంలోని ఫాస్ట్ ఫ్యాషన్ వ్యాపారంలో ఉన్న టాటాలకు చెందిన జుడియో, ఫిప్‌కార్ట్ సంస్థ మింత్రా సహా మరిన్నివాటితో పోటీ పడాలని ఫ్యాషన్ లవర్లకు అందుబాటు ధరలో తన ఉత్పత్తులను ఉంచాలని షీన్ చూస్తోంది.
షీన్ వాస్తవానికి 2024 సెప్టెంబరులో అత్యధికంగా ఫ్యాషన్ ప్రియులు సందర్శించిన వెబ్‌సైట్ గా నిలిచింది. ఈ కాలంలో మెుత్తం ప్రపంచ వెబ్ ట్రాఫిక్ లో కంపెనీ 2.68 శాతాన్ని సొంతం చేసుకుంది. దీంతో కంపెనీ నైకే, హెచ్ అండ్ ఎం, జారా వంటి ప్రముఖ బ్రాండ్లను దాటేసింది. వాస్తవానికి భారత ఐటీ మంత్రిత్వ శాఖ 2020లో దాదాపు 200 చైనాకు సంబంధించిన యాప్ లను దేశంలో నిషేధించిన సంయంలో షీన్ యాప్ కూడా ప్రభావితం అయ్యింది. అయితే ప్రస్తుతం షీన్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా అధిక సంఖ్యలో యూజర్లను పొందుతోంది.
ఫ్యాషన్ ప్రియుల నుంచి నిరంతరం కంపెనీ రష్ చూస్తున్నందున భారత మార్కెట్లపై ప్రస్తుతం కంపెనీ దృష్టి సారించిందని తెలుస్తోంది. గత ఏడాది ప్రారంభంతో పోల్చితే ఆగస్టు నాటికి కొనుగోలుదారుల సంఖ్య దాదాపు 40 శాతం పెరిగింది. అందుకే వ్యూహాత్మక ప్రవేశంలో స్థానిక ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయడానికి, దేశీయ మౌలిక సదుపాయాలపై డేటాను భద్రపరచడానికి రోడ్‌గెట్ బిజినెస్ Pte Ltdతో సాంకేతిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
చైనాకు సంబంధించిన ప్రముఖ బ్రాండ్ 2023లో తొలిసారిగా ఫ్రెంచ్ అమ్మకాలు ప్రముఖ బ్రాండ్లు హెచ్ అండ్ ఎం, ప్రిమార్క్, కియాబీలను అధిగమించి దూసుకుపోతున్నాయి. అయితే 2024 చివరి త్రైమాసికం నాటికి జరాస్‌ను మించిపోతుందని అంచనా వేయబడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా యువత నుంచి ప్రజాధరణ పొందుతున్న వేళ ప్రస్తుతం కొత్తగా ఇండియా మార్కెట్ పై తిరిగి తన దృష్టిని కేంద్రీకరించటం ఫ్యాషన్ వ్యాపారంలో హీట్ పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications