Reliance Retail: నటి ఆలియాభట్ బ్రాండ్ కొన్న ఇషా అంబానీ.. పూర్తి వివరాలు..
Reliance Retail: ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు అంబానీ కుమార్తె ఇషా. ఆమె రాకతో రిటైల్ వ్యాపారం కొత్త పుంతలు తొక్కటం ప్రారంభించింది. ప్రజలు మెచ్చే అనేక బ్రాండ్లను ఆమె అందుబాటులోకి తీసుకొచ్చి కంపెనీ విలువను అమాంతం పెంచేశారు.
ఈ క్రమంలోనే తాజాగా నటి అలియా భట్ స్థాపించిన కిడ్ అండ్ మెటర్నిటీ వేర్ బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మాలో 51% వాటాను కొనుగోలు చేసేందుకు జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకం చేసినట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ప్రకటించింది. దీంతో బ్రాండ్ పర్సనల్ కేర్, బేబీ ఫర్నీచర్, పిల్లల కథల పుస్తకాలు, యానిమేటెడ్ సిరీస్ వంటి కొత్త కేటగిరీలుగా వృద్ధి చెందనుందని వెల్లడైంది.

ఎడ్-ఎ-మమ్మా(Ed-a-Mamma) బ్రాండ్ 2 ఏళ్ల నుంచి 12 సంవత్సరాల వయస్సు మధ్య పిల్లలకు దుస్తులను అందించేందుకు 2020లో అలియా భట్ స్థాపించారు. డిపార్ట్‌మెంట్ స్టోర్‌లలోకి అడుగుపెట్టడానికి ముందర ఇది ఇది ఆన్‌లైన్ బ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ బ్రాండ్ ఉత్పత్తుల ప్రత్యేకత ఏమిటంటే పర్యావరణానికి హాని చేయని పదార్థాలతో ఉత్పత్తి ప్రక్రియలను కొనసాగించటం. ఫ్యాషన్ పరిశ్రమకు మరింత బాధ్యతాయుతమైన భవిష్యత్తును పెంపొందించాలనే రిలయన్స్ బ్రాండ్‌ల దృష్టితో ఇది సజావుగా సాగుతుందని ఇషా అంబానీ అన్నారు.
కొత్త తల్లులుగా మారిన ఇషా నేను అసలు తల్లులకు ఉండే అవసరాల గురించి మాట్లాడుకున్నామని అలియా భట్ తెలిపారు. అయితే రిలయన్స్ తో జతకట్టడం వల్ల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ మరింతగా బలోపేతం అవుతుందని భావింటినట్లు నటి వెల్లడించారు. ఈ వెంచర్ ద్వారా ఎక్కువ మంది తల్లులు, పిల్లలకు తమ ఉత్పత్తులు చేరువ అవుతాయని అన్నారు. రిలయన్స్ రిటైల్ తన సబ్సిడరీ వ్యాపార మార్గాల ద్వారా ఈ పని చేయగలదని వారు నమ్మకంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications