Mukesh Ambani: దేశంలోని అగ్ర వ్యపారవేత్తల్లో ఒకరైన ముకేష్ అంబానీ ఇంట్లో కొత్త వ్యక్తులు వచ్చారు. అంబానీ కూతురు ఇషా, అల్లుడు ఆనంద్ పిరమల్ దంపతులకు డిసెంబర్ 19న కవలలు జన్మించటంతో అంబానీ కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. వీరిలో ఒకరు పాప కాగా మరొకరు బాబు. అయితే పాపకు ఆదియా అని, బాబుకు కృష్ణ అని నామకరణం చేశారు. వీరి జననం అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో జరగగా.. ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొచ్చారు.

తిరుమల కొండకు..
ఇషా దంపతులకు పుట్టిన పిల్లల కోసం ప్రత్యేకంగా పూజలు చేసేందుకు అంబానీ కుటుంబం తిరుమలేసుడిని దర్శించుకున్నారు. వారి అభివృద్ధి కోసం తిరుమల ఆలయ పండితులతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అంబానీ కుటుంబం 300 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు సమాచారం.

నింగికంటిన సంబురాలు..
కొత్త వారసులను ఇండియాకు తీసుకురావటంతో అంబానీ నివాసం ఆంటిలియా, పిరమల్ నివాసం కరుణ సింధులలో సంబురాలు జరుగుతున్నాయి. వీరి రాకకోసం ఆ ఇళ్లలో ప్రత్యేక ఏర్పాటు సైతం చేసినట్లు సమాచారం. ఇంట్లోకి సూర్యకాంతి నేరుగా పడేందుకు వీలుగా ప్రఖ్యాత ఇంటీరియర్ డిజైనర్స్ పెర్కిన్స్ అండ్ విల్ ఆధ్వర్యంలో కొన్ని ఏర్పుట్లు కూడా జరిగాయి. దీనికి తోడు పిల్లల కోసం బ్రాండెడ్ డిజైనర్ వేర్, ప్రయాణానికి ప్రత్యేక వాహనాలు సైతం అంబానీ కుటుంబం అందుబాటులోకి తెచ్చేసింది.

పిల్లల కోసం..
చిన్నారుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సుశిక్షితులైన 8 మంది నర్సులను ఇండియాకు తీసుకొచ్చారు. వీరికి తోడు అమెరికాలో అత్యుత్తమ పీడియాట్రిషియన్ డాక్టర్ గిబ్బన్ కూడా వీరి వెంట వచ్చారు. ప్రస్తుతం మనవడు, మనవరాలు రాకతో ముకేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు మురిసిపోతున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications