Isha Ambani: ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. కనీవినీ లేని విధంగా ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్లు సైతం హాజరయ్యారు. వంటకాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇషా అంబానీ ధరించిన బ్లౌజ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
పచ్చలు, కెంపులతో పాటు అనేక ఇతర విలువైన వజ్ర,వైఢూర్యాలతో పొదిగిన బ్లౌజ్‌ను ఇషా అంబానీ ఈ వేడుకలో ధరించారు. ఇందుకోసం తన వ్యక్తిగత ఆభరణాలను వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంబానీ కుమార్తెతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల డ్రస్ డిజైనర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో బ్లౌజ్ విశేషాలు చెప్పుకొచ్చారు.

ఎర్రటి క్లాత్‌ను బేస్‌గా ఉపయోగించి విలువైన ఆభరణాలతో పొదిగినట్లు డిజైనర్ సందీప్ ఖోస్లా వివరించారు. ఇషా తన వద్ద ఉన్న విలువైన ఆభరణాలన్నింటినీ ఇచ్చినట్లు చెప్పారు. మరికొన్ని కొత్త జ్యూయలరీని గుజరాత్, రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా సేకరించినట్లు తెలిపారు. వాటిలో పోల్కీ, రూబీ, డైమండ్స్‌తో పాటు పచ్చలు కూడా ఉన్నట్లు వెల్లడించారు.
బ్లౌజ్ డిజైనింగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సందీప్ పేర్కొన్నారు. ప్రతి ఆభరణాన్ని మొదట చేతితో గీసిన కాగితపు నమూనాలపై ఉంచి అనంతరం బ్లౌజ్‌లో పొదిగినట్లు తెలిపారు. తర్వాత దాన్ని ధరించగలిగే విధంగా మార్చేందుకు బంగారు, వెండి జర్దోజీ వర్క్‌లతో కూడిన వివిధ ఆభరణాల ముక్కలతో నింపామన్నారు.


Click it and Unblock the Notifications