Reliance Industries: దేశంలో టాప్ వ్యాపారవేత్తగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీ తన తండ్రి ధీరూభాయ్ అంబానీ లెగసీని ముందుకు తీసుకెళుతున్నారు. సోదరుడు అనిల్ అంబానీ ఇప్పుడిప్పుడే దివాళా స్థాయి నుంచి తిరిగి పుంజుకుంటున్నారు. ఈ క్రమంలో అంబానీకి తన బిడ్డల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం, వ్యాపారం-ఆస్తుల్లో ఎక్కువ వాటా ఎవరికి ఇచ్చారనే అంశాలు తెలుసుకోవాలనే ఆసక్తి దేశప్రజల్లో కొనసాగుతోంది.
దేశంలోనే సంపన్న వ్యాపారవేత్త, బిలియనీర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు. వీరిలో ఇషా-ఆకాష్ అంబానీలు కమలలు కాగా చివరి కుమారుడు అనంత్ అంబానీ. 2024లో అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ వివాహాన్ని అంగరంగ వైభంగా దాదాపు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూర్తి చేశారు. దీనిని ప్రపంచ నలుమూలల నుంచి అథిరదులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చర్చ అంబానీ తన వ్యాపారాల్లో ఎక్కువ భాగాన్ని ఎవరకి అప్పగించారు? అసలు అంబానీ వ్యాపార వారసులు ఎవరనేదానిపైనే కొనసాగుతోంది.

వివరాల్లోకి వెళితే అంబానీ తమ కుటుంబ వ్యాపారాల్లో పిల్లలకు సముచిత స్థానాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కోక్కరికీ కంపెనీకి చెందిన 80,52,021 షేర్లు కూడా ఉన్నాయి. ఇది కంపెనీలో వారికి దాదాపు 0.12 శాతం వాటాను అందించింది. ఈ వ్యవహారంలో అంబానీ తల్లి కోకిలా బెన్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఆమెకు కంపెనీలో 0.24 శాతం వటాతో 1,57,41,322 షేర్లు కూడా ఉన్నాయి. ఆమె వ్యాపారాల్లో నేరుగా పాత్ర కలిగి లేనప్పటికీ కుటుంబ పెద్దగా అండగా కొనసాగుతున్నారు.
గడచిన ఏడాది అనంత్ అంబానీ వివాహం సమయంలో మాట్లాడుతూ తన తోబుట్టువులతో ఉన్న అనుబంధం గురించి కొన్ని ఆసక్తికరమై వ్యాఖ్యలు చేశారు. తన అన్న ఆకాష్ రాముడి లాంటి వాడని, ఇషా దేవుడిచ్చిన తల్లిలాంటిదని పేర్కొన్నాడు. తమలో తమకు ఎలాంటి మనస్పర్దలు లేవని ఎలాంటి పోటీ కూడా లేదని స్పష్టంగా వెల్లడించాడు. "ఫెవిక్విక్ తో తాము అతికించబడ్డాం" అని అనంత్ చెప్పడం ముగ్గురు తోబుట్టువుల మధ్య ఐక్యతను హైలైట్ చేసింది.
వాస్తవానికి దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒక్కటైన రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అంబానీ కుటుంబానికి ఉన్న వాటాలు.. వారి ముఖ్యమైన పాత్రను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ కి చెందిన వివిధ కంపెనీల్లో అంబానీ ఫ్యామిలీ కీలక బాధ్యతలు చేపడుతూ వ్యాపారాలను ముందుకు తీసుకెళుతున్నారు. ఇషా రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుండగా.. అంబానీ కుమారుడు ఆకాష్ రిలయన్స్ జియో కంపెనీని విజయవపధంలో నడిపిస్తున్నారు. ఇదే క్రమంలో అనంత్ అంబానీ రిలయన్స్ ఎనర్జీ & పునరుత్పాదక ఇంధన వ్యాపారాలను చూసుకుంటున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications