దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత ధనవంతుల గురించి మాట్లాడినప్పుడల్లా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పేరు మొదట వినిపిస్తుంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ $86.8 బిలియన్ల నికర విలువతో ప్రపంచంలోని 17వ ధనవంతుడు. కానీ మనం అతని పిల్లల గురించి మాట్లాడుకుంటే వీరి ఇతరులకన్నా తక్కువేం కాదు. ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ అండ్ అనంత్ అంబానీ కూడా అత్యంత ధనవంతులు. అయితే అతని ముగ్గురు పిల్లలు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కీలక పదవులు పోషిస్తున్నారు.
ఇషా అంబానీ
ముఖేష్ అంబానీ ఏకైక కుమార్తె ఇషా అంబానీ. ఆమె ఆకాశ్ అంబానీకి కవల సోదరి. ఇషా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిలో ఉన్నారు. ఆమె రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ఇంకా రిలయన్స్ ఫౌండేషన్‌లలో ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బృందంలో కీలక మెంబర్ కూడా. అదనంగా ఇషా తిరా బ్యూటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సహ వ్యవస్థాపకురాలు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో కూడా ఆమె కీలక పదవి పోషిస్తుంది. ఇషా వార్షిక ఆదాయం దాదాపు రూ.4.2 కోట్లు. ఆమె నికర ఆస్తి విలువ రూ. 800 కోట్లు ఉంటుందని అంచనా.

ఆకాష్ అంబానీ
ఆకాష్ అంబానీ ఇషా అంబానీ కవల సోదరుడు. అతను ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు. ఆకాష్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్. ఇంకా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులో డైరెక్టర్ కూడా. మీడియా నివేదికల ప్రకారం, ఆకాష్ వార్షిక జీతం దాదాపు రూ.5.6 కోట్లు. అలాగే అతని మొత్తం నికర విలువ $40.1 బిలియన్లు (సుమారు రూ. 3,300 కోట్లు) అని చెబుతున్నారు.
అనంత్ అంబానీ
ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ. ఆయన రిలయన్స్ జియోలో ఇంధనం అండ్ టెలికాం రంగాలను పర్యవేక్షిస్తారు. అలాగే జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ & రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులలో డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. అనంత్ వార్షిక జీతం రూ. 4.2 కోట్లు. ఆయన నికర ఆస్తి విలువ 40 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,300 కోట్లు) అని చెబుతున్నారు.
అత్యంత ధనవంతుడు ఎవరు?
ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలలో ఆకాష్ అంబానీ అత్యంత ధనవంతుడు. అనంత్ అంబానీ రెండవ స్థానంలో ఉన్నారు. ఇషా పేరు మూడవ స్థానంలో ఉంది. అయితే, ముఖేష్ అంబానీ తన ముగ్గురు పిల్లలకు కంపెనీ బాధ్యతలను అప్పగించారు. అప్పుడప్పుడు తన పిల్లలకు వారి వ్యాపారంలో సహాయం చేయడానికి ముందుకు వస్తుంటారు.


Click it and Unblock the Notifications