మీ చెక్కు బౌన్స్ అయిందా ? లైట్ తీసుకోకండి.. లేదంటే క్రెడిట్ స్కోర్ ఖతం !
చెక్ బౌన్స్... చాలామంది దీన్ని చిన్న విషయంగా లైట్ తీసుకుంటుంటారు. కానీ నిజంగా దీని వల్ల మీ ఆర్థిక భవిష్యత్తు ప్రభావం అవడమే కాకుండా తీవ్రంగా నష్టపోవాల్సి రావొచ్చు. మన దేశంలో చెక్ బౌన్స్ కేసులు నేటికీ కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మీ అకౌంట్లో డబ్బు లేకపోవడం వల్ల చెక్ బౌన్స్ అయితే మీరు ఊహించని విధంగా చిక్కుల్లో పడతారు. చట్టపరమైన చర్యలతో పాటు మీ క్రెడిట్ స్కోరు తీవ్రంగా దిగజారే ప్రమాదం ఉంది.

క్రెడిట్ స్కోరు అంటే మీ ఫైనాన్షియల్ హెల్త్'కి అద్దం లాంటిది. అది ఒక్కసారి పడిపోతే లోన్లు, క్రెడిట్ కార్డులు తినుకోవడం కష్టమైపోతుంది. ఇంకా ఒక చెక్ పదే పదే బౌన్స్ అయితే మీ క్రెడిట్ రేటింగ్ మైనస్‌లోకి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా...
ముందుగా మీ అకౌంట్లో కొంత డబ్బు మైంటైన్ చేయడం నేర్చుకోండి. కేవలం చెక్కు మొత్తానికి సరిపడా డబ్బు కాకుండా మీ ఇతర ఆటో-డెబిట్లు, ఈఎంఐల కోసం కూడా డబ్బు రెడీగా పెట్టుకోవాలి. అలాగే మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. చాలామంది చేసే మరో తప్పు చెక్కుల తేదీలు మర్చిపోవడం. జీతం ఆలస్యంగా వచ్చినా అకౌంట్లో మినిమమ్ డబ్బు లేకపోయినా చెక్ బౌన్స్ అవుతుంది. అందుకే మీ క్యాలెండర్‌లో చెక్కు తేదీలు గుర్తు పెట్టుకోండి లేదా మొబైల్‌లో రిమైండర్ సెట్ చేసుకోండి.
ఇకపై చెక్కులకు బదులు ఆన్‌లైన్ పేమెంట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వండి. NEFT, RTGS, UPI వంటివి ట్రాన్సక్షన్స్ వేగంగా జరుగుతున్నాయి. వీటివల్ల చెక్కులు క్లియర్ అవ్వడంలో జరిగే ఆలస్యం, ఇతర సమస్యలు ఉండవు. ఏదైనా తేడా వస్తే వెంటనే గుర్తించి రిపోర్ట్ చేయొచ్చు లేదా పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ మీ చెక్ బౌన్స్ అయ్యే పరిస్థితి ఉందని తెలిస్తే వెంటనే బ్యాంక్ నుండి చెక్ ద్వారా డబ్బు తీసుకుంటున్న వ్యక్తికి చెప్పేయండి. కొంత సమయం ఇవ్వమని లేదా వేరే పద్ధతిలో పేమెంట్ చేస్తానని చెప్పి సమస్యను ముందే పరిష్కరించుకోండి.
చివరగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెక్ బౌన్స్ అనేది మన దేశంలో క్రిమినల్ నేరం. ఒకసారి చెక్ బౌన్స్ అయితే డబ్బు తీసుకున్న వ్యక్తి మీకు లీగల్ నోటీసు పంపవచ్చు. ఇంకా నోటీసు వచ్చిన 15 రోజుల్లో మీరు డబ్బు చెల్లించకపోతే కేసు కోర్టుకు వెళ్తుంది. అప్పుడు మీ క్రెడిట్ స్కోరు పూర్తిగా దెబ్బతింటుంది.
బ్యాంకులు ప్రతి చిన్న చెక్ బౌన్స్‌ను క్రెడిట్ బ్యూరోకు చెప్పకపోయినా, ఇలాంటివి పదే పదే జరిగితే మీ సిబిల్ స్కోరు ఖచ్చితంగా పడిపోతుంది. మీ రేటింగ్ పడిపోతే ఇంకా భవిష్యత్తులో లోన్లు, క్రెడిట్ కార్డులపై ఎక్కువ వడ్డీ రేట్లు, తక్కువ లిమిట్లు ఉంటాయి. కాబట్టి మీ ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోవాలంటే చెక్ బౌన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణుల సలహా.


Click it and Unblock the Notifications