Allu Arjun: కోర్టు బోనులో పుష్ప-2 స్టార్ అల్లు అర్జున్.. మరణించిన వ్యక్తి ఫ్యామిలీకి సాయం అందిందా?
Allu Arjun Arrest: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగారు. అయితే ఈ నెల 4న ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్యా థియేటరులో ఫ్యాన్స్‍తో కలిసి చూసేందుకు వెళ్లారు. అయితే ఈ క్రమంలో ఫ్యాన్స్ అధికంగా రావటంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.
అయితే ఇది ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అల్లు అర్జున్ అంటే తన కుమారుడిగి ఇష్టం వల్ల ఒక ఫ్యామిలీ సినిమా చూసేందుకు అదే ధియేటరుకు వెళ్లారు. కానీ అక్కడికి అల్లు అర్జున్ రాకతో జరిగిన తొక్కిసలాటంలో మహిళ మృతి చెందారు. ఇదే తొక్కిసలాటలో ఆమె కుమారుడు తీవ్రంగా గాడపడ్డారు. ప్రస్తుతం ఈ బాలుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే అనుకోకుండా జరిగిన దుర్ఘటనపై నటుడు అల్లుఅర్జున్, ప్రొడ్యూసర్లు సైతం స్పందించారు. అయితే ఈ క్రమంలో సదరు బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ క్రమంలో సదరు బాలుడికి వైద్య పరంగా పూర్తిగా ఆరోగ్యం కుదుటపడేంతవరకు అవసరమైన వైద్య ఖర్చులు తామే భరిస్తామని అల్లుఅర్జున్ స్వయంగా మాటిచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొనసాగుతున్న సమస్య పూర్తిగా సొమసిపోగానే బాధిత కుటుంబాన్ని కలుస్తానని ఆయన వెల్లడించారు. అలాగే సదరు బాలుడి చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను తానే స్వయంగా భరిస్తానని కూడా హామీ ఇచ్చారు. అయితే బాధిత కుటుంబానికి ఇప్పటికే నష్టపరిహారం కింద రూ.25 లక్షలు అందించారా లేదా అనే విషయాలు మాత్రం ఇప్పటికీ అధికారికంగా బయటకు రాలేదు. కానీ అనుకోకుండా జరిగిన దుర్ఘటనలో బాధిత కుటుంబానికి తమ నుంచి పూర్తి మద్ధతు ఉంటుందని అల్లుఅర్జున్ వెల్లడించారు.
అల్లు అర్జున్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ అల్లు అర్జున్ పై కేసును విత్ డ్రా చేసుకుంటామని తెలిపారు. అల్లు అర్జున్ ని విడుదల చేయాలని ఆయన కోరారు. జరిగిన తొక్కితలాటకు అల్లు అర్జున్ కి సంబంధం లేదని భాస్కర్ పేర్కొన్నారు. ఇది చూస్తుంటే ఆయనకు ముందుగానే అంగీకరించిన పరిహారం ముట్టి ఉండొచ్చని తెలుస్తోంది.
అల్లు అర్జున్ కేసులో తీర్పు..
తనపై పెట్టిన కేసును పూర్తిగా కొట్టేయాలని అల్లుఅర్జున్ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే కేసులో ఏ11గా ఉన్న అల్లుఅర్జున్ కేసు విషయంలో నాంపల్లి కోర్టు మాత్రం రిమాండుకు తరలించాలని ఆదేశించినప్పటికీ, హైకోర్టు తీర్పును బట్టి తుది నిర్ణయం ఉండనుందని తెలుస్తోంది. నాంపల్లి కోర్టు మాత్రం 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశాలను హైకోర్టు సమర్థిస్తుందా లేదా అనే విషయంపై ఇప్పటికీ వాదనలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications