Small Cap Mutual Funds: స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా..
గత ఆరు నెలలుగా స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లు అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఈక్విటీ విభాగంగా నిలిచాయి. ఇవి దాదాపు 21.26 శాతం సగటు రాబడిని అందిస్తూ ఇతర దేశీయ ఈక్విటీ విభాగాలు, అంతర్జాతీయ ఫండ్‌లను అధిగమించాయని ఓ బిజినెస్ వెబ్ సైట్ పేర్కొంది. ఈ విభాగం గత నెల రోజులుగా తన జోరును కొనసాగిస్తోంది. పెరిగిన దేశీయ లిక్విడిటీ, ఫండ్ మేనేజర్ల ఎంపిక చేసిన స్టాక్స్, బలమైన ఆదాయాల అంచనాల మద్దతుతో గతంలో వచ్చిన నష్టాల నుంచి స్మాల్-క్యాప్ స్టాక్స్‌లో ఇటీవలి పెరుగుదల ఒక పునరుద్ధరణగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఒకటి లేదా రెండు నెలల బలమైన లాభాలను, ఈ పెరుగుదల ధోరణి కొనసాగుతుందనడానికి నిర్ధారణగా భావించవద్దని ఆయన పెట్టుబడిదారులను హెచ్చరించారు.
స్మాల్-క్యాప్ స్టాక్స్ సాధారణంగా ఎక్కువ అస్థిరంగా ఉంటాయని పేర్కొన్నారు. FY27 మొదటి త్రైమాసికంలో స్మాల్-క్యాప్ కంపెనీలలో బలమైన ఆదాయ వృద్ధియే ఈ పనితీరుకు ప్రధాన కారణమని తెలిపారు. ఆయిల్ అండ్ గ్యాస్‌ను మినహాయించి, స్మాల్-క్యాప్ స్టాక్స్‌లో సంవత్సరానికి ఆదాయ వృద్ధి ఈ త్రైమాసికంలో 30 శాతం దాటిందన వివరిస్తున్నారు. మార్చి 2026లో స్మాల్-క్యాప్ స్టాక్స్‌లో వచ్చిన తీవ్రమైన దిద్దుబాటు తర్వాత ఈ ర్యాలీ వచ్చిందన్నారు. స్మాల్ క్యాప్ ఈ కేటగిరీలో 34 ఫండ్‌లు ఉన్నాయిని.. అందులో బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ సుమారు 35.02%తో అత్యధిక రాబడిని అందించగా, దాని తర్వాత ట్రస్ట్‌ఎమ్‌ఎఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ గత ఆరు నెలల్లో 31.27% రాబడిని ఇచ్చింది.

హెచ్‌డిఎఫ్‌సి స్మాల్ క్యాప్ ఫండ్ ఈ కాలంలో దాదాపు 6.81%తో అత్యల్ప రాబడిని అందించింది. నిర్వహణలో ఉన్న ఆస్తుల ఆధారంగా ఈ కేటగిరీలో అతిపెద్ద ఫండ్ అయిన నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, గత ఆరు నెలల్లో 16.55% రాబడిని అందించింది. ఇటీవలి ర్యాలీని కోల్పోయిన పెట్టుబడిదారులకు, స్మాల్ క్యాప్స్‌లో వచ్చిన ఈ ఆకస్మిక పెరుగుదల ఒక సందిగ్ధతను సృష్టిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బలమైన ర్యాలీ తర్వాత ప్రవేశించడం పెట్టుబడిదారులను స్వల్పకాలిక అస్థిరత ప్రమాదానికి గురిచేయవచ్చు, అదే సమయంలో ధర దిద్దుబాటు కోసం నిరవధికంగా వేచి ఉండటం వల్ల తదుపరి లాభాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
చాలా మంది పెట్టుబడిదారులకు, వారి మొత్తం ఈక్విటీ కేటాయింపులో 20-25% లోపు స్మాల్-క్యాప్ వాటాను కొనసాగించడం వివేకవంతమైనదని చెబుతున్నారు. రాబోయే 6-12 నెలల్లో దశలవారీగా క్రమంగా వాటాను పెంచుకోవడం మంచిదని వివరిస్తున్నారు. ఒకవేళ పెట్టుబడిదారులు ర్యాలీని కోల్పోయి ఉంటే, వారు తొందరపడి పెట్టుబడి పెట్టవద్దని, ఎందుకంటే అవి చాలా ఖరీదైనవిగా మారాయని మినోచా అన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
