Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి.. ఎలా పెట్టుబడి పెట్టాలి..!
చాలా మంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంటారు. కచ్చితమైన అవగాహన ఉంటే పెట్టుబడి పెట్టాలి. స్టాక్స్ పై సరైన అవగాహన లేకుంటే.. మ్యూచువల్ ఫండ్ల ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్లలో కూడా రిస్క్ ఉంటుంది. రిస్క్ అనేది మనం పెట్టుబడి పెట్టిన ఫండ్ పై ఆధారపడి ఉంటుంది. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మిడ్ క్యాప్ ఫండ్లలో కాస్త రిస్క్ తక్కువగా ఉంటుంది. ఇండెక్స్, లార్జ్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఇంకాస్త తక్కువగా ఉంటుంది. థీమేటిక్ ఫండ్లలో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ ఫండ్లలో కూడా రిస్క్ ఉంటుంది.
మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే వారు ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. కొన్ని సంవత్సరాల స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. అయితే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే చాలా రిస్క్ ఉంటుంది. అయితే 5 నుంచి 8 సంవత్సరాల పాటు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. అయితే మార్కెట్ పడినప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు భయపడిపోయి డబ్బులు వెనక్కు తీసుకుంటారు. అయితే మార్కెట్ పడిపోయినప్పుడు పెట్టుబడులు పెంచడం వల్ల అధిక రాబడి వచ్చే అవకాశం ఉంటుంది.

మార్కెట్ పడినప్పుడు మనం పెట్టుబడి పెడితే అధిక యూనిట్లు వస్తాయి. ఉదాహరణకు ఎన్ఏవీ రూ.20 ఉంటే.. మీరు రూ.100 పెట్టుబడి పెడితే మీకు 5 యూనిట్లు వస్తాయి. మార్కెట్ పడితే ఎన్ఏవీ రూ.10 తగ్గితే మీ రూ.100 పెట్టుబడికి రూ.10 యూనిట్లు వస్తాయి. అంటే మొదటి సారి పెట్టుబడికి 5 యూనిట్లు వస్తే.. రెండోసారి పెట్టుబడికి 10 యూనిట్లు వచ్చాయి. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్ఏవీ రూ.50 పెరిగితే మీరు పెట్టుబడిన పెట్టిన పెట్టుబడిపై మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. అంటే మార్కెట్ పడినప్పుడు పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచనగా చెప్పుకోవచ్చు. అయితే ఓ వ్యక్తి మ్యూచువల్ ఫండ్లలో రూ.5 వేలు పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ఇందులో రూ.2 వేలు స్మాల్ క్యాప్, రూ.1000 మిడ్ క్యాప్, రూ.1000 ఇండెక్స్ ఫండ్, రూ.1000 మల్టీ లేదా ఫ్లెక్సీ క్యాప్ లో పెట్టుబడి పెడితే రిస్క్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధిస్తారు. ఇందులో షార్టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది.
సంవత్సరంలో వచ్చిన రాబడిపై షార్టర్మ్ క్యాపిటల్ గెయిన్ వసూలు చేస్తారు. సంవత్సరం దాటిన తర్వాత వచ్చే రాబడిపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వసూలు చేస్తారు. మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. అయితే రిస్క్ తక్కువగా ఉండాలకునే వారు డెట్ ఫండ్లలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈక్విటీ ఫండ్లతో పోల్చితే డెట్ ఫండ్లలో రాబడి తక్కువగా ఉంటుంది. డెట్ ఫండ్లలో కూడా రకాలు ఉంటాయి. ఓవర్ నైట్ ఫండ్స్, షార్ట్ డ్యూరెషన్ ఫండ్లు, లో డ్యూరేషన్ ఫండ్లు ఉంటాయి.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు ఆ ఫండ్ గత ఐదు సంవత్సరాలు ఎంత రాబడి ఇచ్చిందో తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఈ ఫండ్ ఎలా పని చేస్తుందో అంచనా వేయాలి. బెంచ్ మార్క్ తో ఫండ్ ను పోల్చుకోవాలి. అప్పుడే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి. లమ్సం కంటే సిప్ రూపంలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఒక వేళ మీరు లమ్సం రూపంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. మార్కెట్ పడినప్పుడు పెట్టుబడి పెట్టారు. మార్కెట్ హై లో ఉన్నప్పుడు పెట్టుబడి పెడితే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైనా మార్కెట్ పడుతున్నప్పుడు, పడినప్పుడు పెట్టుబడి పెడితే మంచి లాభం వచ్చే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
