అధిక నిర్వహణ ఖర్చులు, పెరుగుతున్న నష్టాల కారణంగా అమెరికన్ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ ఇండియాలో వ్యాపారాన్ని మూసివేయబోతోందన్న వార్తలను టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కొట్టిపారేసింది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మూడు కీలక భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలకు రాసిన లేఖలో ఈ వార్తలు నిజం కాదని పేర్కొన్నాయి. స్టార్‌బక్స్ 2012లో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌తో చేతులు కలిపి భారతదేశంలో వ్యాపారాన్ని ప్రారంభించింది.
ది ఫిలోక్స్ నివేదికలో దావా
డిసెంబర్ 19న రాజస్థాన్‌కు చెందిన ది ఫిలాక్స్ అనే మీడియా సంస్థ స్టార్‌బక్స్ త్వరలో భారతదేశంలో వ్యాపారాన్ని మూసివేయవచ్చని ఒక నివేదికలో తెలిపింది. 'అధిక ధర, టెస్ట్ లేకపోవడం, పెరుగుతున్న నష్టాల కారణంగా స్టార్‌బక్స్ భారత్‌ను విడిచిపెట్టవచ్చు' అనే హెడింగ్ తో వార్త రాసింది. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత, భారతదేశంలో స్టార్‌బక్స్ అన్ని అవుట్‌లెట్‌లను మూసివేయబోతోందని చాలా మంది ఊహించారు, ఎందుకంటే భారతదేశంలోని ప్రజలు సాధారణంగా ఖరీదైన వస్తువులకు బదులుగా లోకల్ అండ్ బడ్జెట్లో అందుబాటులో ఉండేవి తీసుకోవాలని ఆలోచనతో ఉంటారు. అయినగాని ఫిలోక్స్ తన రిపోర్టులో కంపెనీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటనను ప్రస్తావించలేదు. స్టార్‌బక్స్ ఉత్పత్తులు మరింత కాస్ట్లీ గా ఉన్నాయని ఈ కారణంగానే భారత మార్కెట్లో లాభాలను ఆర్జించడంలో కంపెనీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని నివేదికలో పేర్కొంది. స్టార్‌బక్స్ భారతదేశంలో మరిన్ని కొత్త స్టోర్లను తెరవడం ఆలస్యం కావచ్చని వార్తలు వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఫిలాక్స్ కంపెనీ
స్టార్‌బక్స్ భారతదేశాన్ని విడిచిపెట్టడం గురించి నివేదికతో వెలుగులోకి వచ్చింది.

భారీ నష్టాలను చుసిన కంపెనీ
ఈ ఏడాది మేలో విడుదల చేసిన TCPL అన్యువల్ రిపోర్ట్ ప్రకారం టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అండ్ అమెరికన్ కాఫీ చైన్ స్టార్‌బక్స్ మధ్య జాయింట్ వెంచర్ అయిన టాటా స్టార్‌బక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో నష్టాలు రూ. 81 కోట్లకు పెరిగాయి, అధిక ఖర్చులు కేవలం 12 శాతం ఆదాయాన్ని మాత్రమే ఆర్జించాయి. అయితే, స్టార్‌బక్స్ భారతదేశాన్ని విడిచిపెట్టినట్లు వచ్చిన వార్తలను TCPL ఖండించింది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, బిఎస్ఇ అండ్ కలకత్తా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు రాసిన లేఖలో ఫిలాక్స్ నివేదిక ఫేక్ అని పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications