social media tax: సోషల్ మీడియా ఇన్ఫ్లూయెర్స్ జర జాగ్రత్త.. ఈ ట్యాక్స్ రూల్స్ తెలుసుకోండి..
social media tax: ఉద్యోగులు, వ్యాపారస్థులు ఏటా ఆదాయపు పన్ను చెల్లిస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే యూట్యుబ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తున్న కంటెంట్ క్రియేటర్స్ సంగతి ఏంటి అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా..? ఆదాయపు పన్ను శాఖ దీని గురించి ఏం చెప్తుందో చూద్దాం..
యూట్యుబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ ఇన్ వంటి సోషల్ మీడియా ద్వారా సంపాదించే ఇన్ఫ్లూయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని IT శాఖ చెబుతోంది. చట్ట ప్రకారం ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తే, జూలై 31 లోపు రిటర్నులు దాఖలు చేయాలని సూచిస్తోంది.

జీతం, వ్యాపారం, అద్దెలు, క్యాపిటల్ గైన్స్, ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయాలపై పన్ను చెల్లించాలని IT శాఖ పేర్కొంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ తమ జీతం లేదా వ్యాపార ఆదాయంపై పన్నులు చెల్లిస్తున్నప్పటికీ.. సామాజిక మాధ్యమాల ద్వారా పొందుతున్న ఆదాయంపైనా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని చెబుతోంది.
సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయం మొదటి 4 కేటగిరీల్లోకి కాకుండా ఇతర వనరుల కిందకు వస్తుంది. ఒకవేళ ఇది గనుక బహుమతులు రూపంలో చెల్లించబడినట్లయితే.. 20 వేల కంటే ఎక్కువ విలువైన గిఫ్ట్స్ పై గతేడాది జూలై నుంచి 10 శాతం TDSను IT శాఖ విధిస్తోంది. కాబట్టి ఈ తరహా ఆదాయాన్ని రిటర్న్స్‌లో చూపించనట్లయితే ఫైన్ తోనైనా వెంటనే ఫైల్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత నెలలో UP, కేరళలోని అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లపై దాడులు చేశారు. రిటర్న్స్ లో ఫైల్ చేయని భారీ మొత్తంలో నగదును వారి వద్ద గుర్తించారు. డిపార్ట్ మెంట్ ఉపయోగించిన డేటా అనలిటిక్స్, సోషల్ మీడియా కంపెనీల TDS కటింగ్స్, ఆయా ఇన్ఫ్లూయెన్సర్ల విదేశీ పర్యటన ఫొటోలు ఆధారంగా పన్ను ఎగవేతదారులను గుర్తించినట్లు IT అధికారులు తెలిపారు.


Click it and Unblock the Notifications