ఒకప్పుడు బంగారం (Gold) కంటే వెండిని తక్కువగా చూసేవాళ్లు. కానీ, మారుతున్న పరిస్థితులు చూస్తుంటే.. వెండి (Silver)ని బంగారంతో సమానంగా చూసే రోజు వస్తుందా అన్న అనుమానం వస్తుంది. అంతేకాదు, ఇప్పుడు పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలో బంగారంతో పాటు వెండికి కూడా చోటు దక్కుతోంది. అసలు వెండికి డిమాండ్ ఇంతలా పెరగడానికి కారణాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సంవత్సరం అందరూ బంగారం ధరల గురించే మాట్లాడుకున్నారు. కానీ, వెండి ధరలు కూడా అసాధారణంగా పెరిగి రికార్డులను బద్దలు కొట్టాయి. సాధారణంగా 'పేదవాడి బంగారం'గా పిలవబడే ఈ లోహం.. ఒకేసారి రెండు ప్రయోజనాలను అందిస్తుంది: ద్రవ్యోల్బణం (Inflation) నుంచి రక్షణ కల్పించడంతో పాటు, ప్రపంచ పారిశ్రామిక వృద్ధికి అనుసంధానమై ఉంటుంది. ఈ ద్వంద్వ స్వభావమే వెండిని ప్రత్యేకంగా నిలబెడుతోంది.
డిసెంబర్ 2025.. వెండికి ఒక మైలురాయి
2025లో వెండి ధరల ర్యాలీ అనూహ్యంగా మారింది. ఈ ఏడాది జనవరి(2025) నాటికి కేజీ వెండి ధర సుమారు రూ.80,000 ఉండగా.. ఆగస్టు 2025 నాటికి రూ. 1లక్ష మార్క్ దాటింది. ఆ తర్వాత అక్టోబర్ 2025 నాటికి రూ. 1,40,000 దాటింది. ఇప్పుడు డిసెంబర్ 2025లో ఆల్ టైం హయ్యెస్ట్ కు చేరుకుని ఏకంగా రూ.1,90,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. త్వరలోనే రూ.2 లక్షల మార్క్ దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అధిక లాభాలు
వెండి ధరలు ఒక్క ఏడాదిలోనే ఇంతగా మారిపోవడంతో ఇన్వెస్టర్లు కూడా వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది వెండి 70 శాతానికి పైగా రిటర్న్‌లను ఇచ్చింది. బంగారంలో పెట్టుబడి పెట్టలేని వారికి వెండి మంచి ఆప్షన్ గా కనపిస్తుంది. దాంతో ఇందులో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి.
డిమాండ్‌ను పెంచుతున్న క్లీన్ ఎనర్జీ విప్లవం
వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం గత ఐదు సంవత్సరాలుగా స్థిరంగా కొనసాగుతున్న సరఫరా-డిమాండ్ అసమతుల్యత. గనుల ఉత్పత్తి పరిమితంగా ఉండటం, రీసైక్లింగ్ మందగించడం వల్ల ప్రపంచ సరఫరా డిమాండ్‌ను అందుకోలేకపోతోంది. మరోవైపు ప్రపంచం క్లీన్ ఎనర్జీ (Clean Energy) వైపు వేగంగా మళ్లుతుండటంతో వెండి పారిశ్రామిక డిమాండ్ అమాంతం పెరిగింది. డీకార్బనైజేషన్ (Decarbonisation) లక్ష్యంగా ప్రపంచ దేశాలు సౌరశక్తి సామర్థ్యాన్ని పెంచడంతో ఈ రంగంలో వెండి డిమాండ్ పెరుగుతోంది. 2020లో వెండి డిమాండ్ 83 మిలియన్ ఔన్సులుగా ఉండగా.. 2025లో దాదాపు 196 మిలియన్ ఔన్సులకు పెరిగింది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా వెండి అవసరం. దాంతో ఇటు నుంచి కూడా డిమాండ్ పెరుగుతోంది.
సిల్వర్ ETFలు: చిన్న పెట్టుబడిదారులకు వరం
గతంలో వెండిని కొనుగోలు చేయాలంటే భౌతికంగా ఆభరణాలు, కడ్డీలు లేదా ఫ్యూచర్స్ మార్కెట్ ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది. కానీ భౌతిక వెండిలో భద్రత, స్వచ్ఛత సమస్యలు ఉంటాయి. సెప్టెంబర్ 2021లో సెబీ (SEBI) అనుమతించిన సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (Silver ETFs) చిన్న పెట్టుబడిదారులకు మార్గాన్ని సులభతరం చేశాయి. సిల్వర్ ఈటీఎఫ్‌లు అతి తక్కువ కాలంలో అపారమైన వృద్ధిని సాధించాయి. అక్టోబర్ 2023లో రూ.2,844 కోట్లుగా ఉన్న వెండి పెట్టుబడులు.. సెప్టెంబర్ 2025 నాటికి రూ.37,518 కోట్లుకు పెరిగింది. అలాగే గత మూడేళ్లలో గోల్డ్ ఈటీఎఫ్‌లు34.86% రిటర్న్‌లను ఇస్తే.. సిల్వర్ ఈటీఎఫ్‌లు సగటున 39.14% ఇచ్చాయి. అంటే బంగారం కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి.
మీ పోర్ట్‌ఫోలియోకు వెండి(Silver) అవసరమా?
వెండి ధరలు ప్రస్తుతానికి పెరుగతున్నా ఈ ట్రెండ్ మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా వెండి మాత్రం పెట్టుబడికి ఒక మంచి ఆప్షన్ అని అందరు నిపుణులు చెప్పే మాట. ఇది ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించడంతో పాటు, ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పుడు బంగారం కంటే మెరుగైన రాబడిని ఇస్తుంది. నిపుణుల సలహా ప్రకారం.. మీ పోర్ట్‌ఫోలియోలో విలువైన లోహాల కోసం 15% కేటాయింపు చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. అలాగే అందులో బంగారం, వెండిని సమానంగా విభజించడం ఒక బెస్ట్ స్ట్రాటజీ.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications