రిటైర్మెంట్ వయస్సు పెంపు.. ఇప్పుడు 60 ఏళ్ళు కాదు 62కి ? నిజం ఏంటి అంటే..
ఈ కాలంలో యువతకి ప్రభుత్వ ఉద్యోగమే మొదటి అప్షన్. దీనికి అతిపెద్ద కారణం ఏంటంటే ఉద్యోగ వయస్సు పూర్తయిన తర్వాత లభించే ఆర్ధిక భద్రత ఇంకా పెన్షన్. ప్రస్తుతం పదవీ విరమణకు సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచిందని ఉంది. అంటే ఏప్రిల్ 1 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును రెండేళ్లు పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పోస్ట్ ప్రకారం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు 60 సంవత్సరాలకు కాకుండా 62 సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తారు.

వైరల్ పోస్ట్‌లో ఏముందంటే : సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారం నిజమైనదేనా కాదో మొదట గమనించాలి. ఎందుకంటే ఫేక్ లేదా తప్పుడు సమాచారం కూడా నిజమైనదిలా ఉంటాయి. ఈ పోస్ట్ విషయంలో కూడా అలాంటిదే జరుగుతోంది. ఈ సమాచారాన్ని ఫాక్ట్ చెక్ చేసినప్పుడు, వాస్తవం కాదని తప్పుడు సమాచారం అని తేలింది. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 2 సంవత్సరాలు పెంచి 62 సంవత్సరాలకు పెంచిందని సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వైరల్ అవుతోందని PIB ఫ్యాక్ట్ చెక్ ఒక పోస్ట్‌లో పేర్కొంది. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవల నుండి ప్రభుత్వం ప్రయోజనం పొందేలా ఈ చర్య తీసుకున్నట్లు అందులో ఉంది.
వైరల్ పోస్ట్ వెనుక ఉన్న నిజం ఏంటి : ఇప్పుడు ఈ పోస్టులో నిజం ఏంటి అంటే PIB ఫ్యాక్ట్ చెక్‌లో ఈ వార్త నకిలీదని పేర్కొంది. పిఐబి ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, ఈ పోస్ట్ నకిలీ వార్త ఇంకా అందులో ఎటువంటి నిజం లేదు. ఈ ఫాక్ట్ చెక్ లో భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇంకా ఈ సోషల్ మీడియా హల చల్ చేస్తున్న పోస్ట్ నకిలీ వార్త అని తెలిపింది.
ఈ వైరల్ పోస్ట్ ఉద్యోగులను తప్పుదారి పట్టించడమే కాకుండా ప్రభుత్వ నిర్ణయాల గురించి సాధారణ ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తుంది. ప్రజలు ఇలాంటి సమాచారాన్ని నమ్మడం లేదా షేర్ చేసే ముందు దానిని వెరిఫై చేసుకోవడం చాలా ముఖ్యం, ముఖ్యంగా అధికారిక ప్రకటన కానప్పుడు. తప్పుడు సమాచారానికి బలైపోకుండా ఉండటానికి లేదా ప్రభుత్వ ప్రకటనలను ఎలా తెలుసుకోవడానికి కోసం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) లేదా ఇతర అధికారిక ప్రభుత్వ సైట్స్ వంటి నమ్మకమైన సోర్సెస్ పై ఆధారపడటం ముఖ్యం.


Click it and Unblock the Notifications