Mutual Funds: ప్రస్తుతం పెద్ద మొత్తంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చా..!
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే వారు సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏక మొత్తంలో పెట్టుబడి ఎప్పుడు పెట్టాలని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే మార్కెట్ పడిపోయినప్పుడు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం సంక్లిష్టంగా మారుతుంది. మీరు మీ డబ్బును ఇప్పుడే పెడతారా, మరో దిద్దుబాటు కోసం వేచి ఉంటారా, లేదా వివిధ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలలో విస్తరిస్తారా? అక్టోబర్ 13న సెన్సెక్స్ 1,109 పాయింట్లు పెరిగినప్పటికీ, ఈ ఏడాది ఇప్పటివరకు 14.27 శాతం నష్టంలోనే ఉంది. ఈ దిద్దుబాటు అనేక మార్కెట్ విభాగాలలో వాల్యుయేషన్లను తగ్గించినప్పటికీ, మెరుగైన అవకాశాలు ఎక్కడ ఉన్నాయనే దానిపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
లార్జ్-క్యాప్ ఫండ్లు పడిపోయినప్పటికీ వాటి పట్ల అందరూ అనుకూలంగా లేరు. కొందరు స్మాల్-క్యాప్‌లలో ఎక్కువ వృద్ధి సామర్థ్యాన్ని చూస్తుండగా, మరికొందరు ఫ్లెక్సీ-క్యాప్, మల్టీ-క్యాప్, మల్టీ-అసెట్ ఫండ్లను ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఏ కేటగిరీలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి, మీ పెట్టుబడి కాలపరిమితి ఆ ఎంపికను ఎంతవరకు ప్రభావితం చేయాలనే దానిపై నిపుణులకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా మార్కెట్ అస్థిరత సమయంలో కూడా పెట్టుబడిని కొనసాగించగల పెట్టుబడిదారులకు స్మాల్-క్యాప్ ఫండ్లు గణనీయమైన దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని అందిస్తాయని
ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ సందీప్ బాగ్లా అన్నారు.

దీర్ఘకాలిక దృక్పథంతో చూస్తే స్మాల్-క్యాప్‌లు అత్యంత ఆశాజనకంగా కనిపిస్తున్నాయిని ఆయన వివరించారు. వర్ధమాన రంగాలు, నూతన వ్యాపార నమూనాలు, చిన్న కంపెనీలలో విస్తృత శ్రేణి వృద్ధి అవకాశాలు ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు. దిద్దుబాటు తర్వాత లార్జ్-క్యాప్‌ల పరిస్థితి చాలా మెరుగుపడిందని వైజ్ ఫిన్‌సర్వ్ గ్రూప్ సీఈఓ, సీఐఓ అయిన అజయ్ కుమార్ యాదవ్ చెప్పారు. వాటి అంచనా ఫార్వర్డ్ పీ/ఈ 17.6 రెట్లు కూడా, చారిత్రక సగటు అయిన 20.9 రెట్ల కంటే తక్కువగా ఉందని గుర్తు చేశారు. స్మాల్-క్యాప్, మైక్రో-క్యాప్ ఫండ్లలో కొత్తగా పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టడం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
తమ పెట్టుబడులను ఒకే మార్కెట్-క్యాప్ విభాగంలో కేంద్రీకరించకూడదనుకునే పెట్టుబడిదారులకు, వైవిధ్యభరితమైన కేటగిరీలు మరో మార్గాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మరింత సమతుల్యమైన పోర్ట్‌ఫోలియోను కోరుకునే పెట్టుబడిదారుల కోసం ఫ్లెక్సీ-క్యాప్, మల్టీ-క్యాప్ ఫండ్ల బెటరని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications