New Tax Regime: మరో మూడు వారాల్లో ఇంటెరిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో పన్ను చెల్లింపుదారులు తమ కోరికల చిట్టాలోని అంశాలపై ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కేంద్రం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ప్రయోజనాలను కొత్త పన్ను విధానానికి విస్తరించవచ్చని ఊహాగానాలకు ఊతమిచ్చే నివేదిక ఒకటి వెలువడింది. ప్రస్తుతం పాత పన్ను విధానంలోని ప్రయోజనాలు న్యూ టాక్స్ రీజిమ్ లో కేంద్రం అందించలేదు. అయితే రాబోయే బడ్జెట్ ఎన్పీఎస్ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించబడుతుందని సమాచారం.

పన్ను శ్లాబ్ రేట్లలో అందించిన మినహాయింపుల ప్రకారం న్యూ టాక్స్ రీజిమ్ ఎంతో ప్రయోజనకరమైనదే. అయితే ఇందులో వివిధ మినహాయింపులను పొంది టాక్స్ సేవ్ చేసుకునేందుకు అవకాశం కల్పించబడలేదు. వాస్తవానికి న్యూ టాక్స్ రీజిమ్ కింద HRA, LTA, 80C, 80Dతో పాటు మరిన్ని సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు, తగ్గింపులను క్లెయిమ్ చేయలేరు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మునుపటి పన్ను విధానంలోని నిబంధనల మాదిరిగానే NPS పెట్టుబడులపై మినహాయింపులను మంజూరు చేసే ఎంపికను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని పన్ను చెల్లింపుదారులకు మరింత ఆకర్షణీయంగా చేయడానికి ఇలా చేస్తున్నట్లు సమాచారం.
నేషనల్ పెన్షన్ సిస్టమ్, అటల్ పెన్షన్ యోజన వంటి పెన్షన్ పథకాలు 2023లో 97 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకున్నాయని, డిసెంబర్ చివరి నాటికి మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్ 7.03 కోట్లకు చేరుకుందని పిఎఫ్‌ఆర్‌డిఎ చైర్మన్ దీపక్ మొహంతి గత వారం తెలిపారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications