Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈవారం ఎలా ఉంటాయనే అనుమానాలు దేశీయ ఇన్వెస్టర్లలో కొనసాగుతోంది. వాస్తవానికి దేశీయంగా ఎలాంటి పెద్ద పరిణామాలు లేకపోయినా.. ఈ వారం స్టాక్ మార్కెట్ల దిశను గ్లోబల్ ట్రెండ్, విదేశీ ఇన్వెస్టర్ల కార్యకలాపాలు నిర్ణయిస్తాయి. నెలవారీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల సెటిల్‌మెంట్ కారణంగా ఈ వారం మార్కెట్‌లో కొంత ఒడిదుడుకులు కనిపించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గతవారం యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన భారతీయ స్టాక్ మార్కెట్లు గత వారం రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకోవటంతో పాటు ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.6 లక్షల కోట్లు పెరిగింది. చారిత్రాత్మకంగా అమెరికాలో వడ్డీరేట్ల తగ్గింపు వర్ధమాన మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపిందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అన్నారు. ప్రపంచ ఇన్వెస్టర్లలో భారత్ ఒక ప్రాధాన్య గమ్యస్థానంగా అవతరించిందన్నారు. ఈ వారంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దూకుడుగా కొనుగోళ్లు జరిపారన్నారు.

గడచిన శుక్రవారం ఒక్కరోజునే భారతీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు రూ.14,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఈ వారం మార్కెట్లకు మార్గనిర్థేశం చేసే ప్రధాన ఈవెంట్స్ లేనప్పటికీ US స్థూల ఆర్థిక డేటా మార్కెట్‌కు ముఖ్యమైనదిగా ఉంటుంది. దేశీయ సంస్థాగత ప్రవాహాలను కూడా నిశితంగా పరిశీలించడంతోపాటు, భారతీయ స్టాక్ మార్కెట్‌కు ఎఫ్‌ఐఐ ఇన్‌ఫ్లోలు ఒక ముఖ్యమైన అంశంగా కొనసాగుతాయని మీనా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మార్కెట్‌పై భౌగోళిక రాజకీయ ప్రమాదాల ప్రభావం కనిపించనప్పటికీ ఇది మార్కెట్‌కు పెద్ద ముప్పును కలిగిస్తుందని మీనా పేర్కొన్నారు. డెరివేటివ్స్ సెటిల్మెంట్ కారణంగా మార్కెట్‌లో అస్థిరత ఉండవచ్చని అన్నారు.
మార్కెట్ నెమ్మదిగా పురోగమిస్తోందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ (వెల్త్ మేనేజ్‌మెంట్) హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా పేర్కొన్నారు. బలమైన ఎఫ్‌ఐఐ ఇన్‌ఫ్లోలు, ఆరోగ్యకరమైన దేశీయ స్థూల కారకాలు, యూఎస్ ఆర్థిక వ్యవస్థలో మందగమనం గురించి తగ్గుతున్న ఆందోళనల కారణంగా ఈ వారం సానుకూల మొమెంటం కొనసాగుతుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధరల్లో హెచ్చుతగ్గులు కూడా మార్కెట్ దిశను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే ప్రధాన సంఘటన మన వెనుక ఉన్నప్పటికీ, మార్కెట్ ముందుకు వెళ్లే దిశలో అందరి దృష్టి అమెరికాపైనే ఉంటుందని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్-రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. అలాగే విదేశీ నిధుల ప్రవాహం, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులపై కూడా పెట్టుబడిదారులు తమ దృష్టి ఉంచాలని సూచించారు.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్‌లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications