ITR Filing 2024: దేశంలోని కోట్ల మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు నేడు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే పన్ను చట్టాల ప్రకారం జూలై 31, 2024 గడచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన సమయం. అయితే ఇప్పటికీ గడువు పొడిగింపు గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చివరి క్షణాల్లో సైతం కొందరు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలుకు ఇచ్చిన గగడువును పొడిగించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ ఇప్పటికే పన్ను సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్‌ని 2024-25 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ITR ఫైల్ చేయడానికి గడువును ఒక నెల పాటు పెంచాలని విన్నవించింది. ఈ లెక్కన ఆగస్టు 31, 2024 వరకు గడువు పొడిగింపును అభ్యర్థించింది. అయితే దీనిని పన్ను అధికారులు ఎంత వరకు పరిణిస్తారే విషయంపై ఈ రోజు పూర్తిగా క్లారిటీ రానుంది.

ఇదే క్రమంలో కేరళ వయనాడ్ ప్రణళంతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ వంటి చోట్ల ప్రతికూల వాతావరణాన్ని పరిగణలోకి తీసుకోవాలని యూనియన్ పేర్కొంది. వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నందున ఐటీఆర్ ఫైలింగ్ గడువును పెంచటాన్ని పరిగణించాలని ఏఐఎఫ్‌టీపీ జాతీయ అధ్యక్షుడు నారాయణ్ జైన్, డైరెక్ట్ ట్యాక్స్ రిప్రజెంటేటివ్ కమిటీ చైర్మన్ ఎస్‌ఎం సురానా ఫెడరేషన్‌కు లిఖితపూర్వకంగా కోరారు. ఈ విజ్ఞప్తిపై ఇప్పటి వరకు పన్ను శాఖ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటం చూస్తుంటే గడువు పొడిగింపు లభించే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.
ఈ ఊహాగానాలను పక్కనపెట్టి ప్రజలు తమ ఐటీఆర్ ఫైలింగ్ వీలైనంత త్వరగా నేడు పూర్తి చేయటం వారిని అనవరసమైన జరిమానాల నుంచి రక్షిస్తుంది. పన్ను చెల్లింపుదారులు జరిమానా లేకుండా జూలై 31 వరకు రిటర్నులు దాఖలు చేయవచ్చు. ఇక జరిమానా వివరాలను పరిశీలిస్తే.. నేడు రిటర్న్ ఫైల్ చేయటం మిస్ అయిన వ్యక్తుల ఆదాయం రూ.5 లక్షలకు పైగా ఉంటే రూ.5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు లోపు ఉన్నట్లయితే రూ.1000 జరిమానాగా ఆలస్య రుసుము చెల్లించుకోవాల్సి ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications