సాధారణంగా మధ్యతరగతి ప్రజలకు ఉన్న నమ్మకం ఒక్కటే.. డబ్బును భూమి మీద కానీ, బంగారం మీద కానీ పెడితే అది ఎప్పటికీ తగ్గదని. అయితే గత కొన్ని నెలలుగా బంగారం ధరలు (gold rates) పెరుగుతున్న తీరు చూస్తుంటే సామాన్యులకు ఒక రకమైన 'ఫోమో' (FOMO - Fear of Missing Out) మొదలైంది. అంటే "అయ్యో.. ధరలు చేదాటిపోతున్నాయి, నేను కొనేసరికి ఇంకా పెరిగిపోతాయేమో, నేను ఇన్వెస్ట్ చేయడం లేట్ చేసేశానా?" అన్న భయం చాలా మందిలో నెలకొంది.

నిజంగానే మీరు ఆలస్యం చేశారా?
నిజానికి, బంగారంలో పెట్టుబడి పెట్టడానికి 'సరైన సమయం' అంటూ ఏదీ ఉండదు. చరిత్రను గమనిస్తే.. పదేళ్ల క్రితం తులం బంగారం రూ. 30,000 ఉన్నప్పుడు కూడా ప్రజలు "ధరలు చాలా ఎక్కువ ఉన్నాయి" అని అనుకున్నారు. కానీ, ఈరోజు అది రూ. 1.50 లక్షలకు చేరింది. కాబట్టి దీర్ఘకాలికంగా చూస్తే బంగారం ఎప్పుడూ బంగారమే. బంగారంలో పెట్టుబడి (gold ivestment) పెట్టేవాళ్లు ఎప్పుడూ లాభాలనే చూస్తారు. మీరు ఇప్పుడు కొనడం లేట్ అని అనుకుంటే.. రేపు ధర రూ. 2 లక్షలకు చేరినప్పుడు "రూ. 1.50 లక్షలు ఉన్నప్పుడే కొంటే బాగుండేది" అని మళ్ళీ బాధపడాల్సి వస్తుంది.
ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,800 లక్షల మార్కును తాకగా, వెండి ధర కిలో రూ. 3.40 లక్షలకు చేరి రికార్డులు సృష్టిస్తోంది. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ పెరుగుదల కనిపిస్తోంది. అయితే, ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయని కంగారుపడి అప్పులు చేసి మరీ బంగారం కొనడం కూడా సరైన పద్ధతి కాదు.
ఇప్పుడు ఏం చేయాలి? మీకోసం కొన్ని స్మార్ట్ టిప్స్..
- ఒకేసారి వద్దు.. విడతలుగా ముద్దు: మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే బంగారు ఆభరణాలు కాకుండా డైరెక్ట్ గా బ్యాంకులో గోల్డ్ కాయిన్స్ లేదా బార్స్ వంటివి కొనండి. లేదా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయండి. దీనివల్ల ధరల హెచ్చుతగ్గుల (Market Volatility) నుంచి మీరు తప్పించుకోవచ్చు.
- ఆభరణాల కంటే నాణేలు మేలు: మీరు కేవలం పెట్టుబడి కోసమే కొంటున్నట్లయితే, బిస్కెట్లు లేదా నాణేలు కొనండి. ఆభరణాల రూపంలో కొంటే తరుగు (Wastage), మజూరీ (Making Charges) రూపంలో 10% నుండి 20% వరకు మీ డబ్బు వృథా అవుతుంది.
- డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపండి: ఫిజికల్ గోల్డ్ భద్రత గురించి భయముంటే.. గోల్డ్ ఈటీఎఫ్ (ETF) లేదా గోల్డ్ బాండ్లు (SGB) అద్భుతమైన మార్గాలు. ఇందులో మీకు అదనంగా 2.5% వడ్డీ కూడా లభిస్తుంది.
మొత్తంగా మధ్య తరగతి వాళ్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. బంగారం (gold) అనేది కేవలం లాభాల కోసం మాత్రమే కాదు.. అది మీ కుటుంబానికి ఒక ఆర్థిక రక్షణ కవచం. ధరలు భారీగా పడిపోతాయని వేచి చూడటం కంటే, చిన్న మొత్తంలోనైనా మీ పొదుపును ప్రారంభించడం ముఖ్యం. రేపటి భారీ ధరల కంటే నేటి 'ఆల్ టైమ్ హై' ధరే మీకు భవిష్యత్తులో తక్కువగా అనిపించవచ్చు! కాబట్టి నిపుణుల సలహా మేరకు.. గోల్డ్ ఈటీఎఫ్ లేదా ఫిజికల్ గోల్డ్ రూపంలో ఎంతో కొంత బంగారంలో పెట్టుబడి పెట్టండి.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications