IT shares: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మార్చి సిరీస్ F&O డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో దలాల్ స్ట్రీట్ స్టాక్‌లు బుధవారం పురోగమించాయి. పైగా మార్కెట్లలో ఆ దూకుడు నేడు సైతం కొనసాగింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఐటీ రంగంలోని షేర్లలో ఉన్న తమ పెట్టుబడులను కొనసాగించాలా లేక సేల్ చేయాలా అని చాలా మంది అయోమయంలో ఉన్నారు.
ఈ క్రమంలో టెక్ స్టాక్స్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రోతో సహా టెక్నాలజీ స్టాక్స్ పై యెస్ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ లక్ష్మీకాంత్ శుక్లా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్..
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ రోజువారీ స్టాకాస్టిక్ ఓసిలేటర్ ఓవర్‌సోల్డ్ జోన్ నుంచి పుంజుకుని పుల్‌బ్యాక్‌ను సూచిస్తుంది. ప్రస్తుత స్థాయిల్లో స్టాక్ గట్టి ప్రతిఘటనను ఎదుర్కొనే అవకాశం ఉన్న రూ.3,280-3,300 జోన్ వైపు పుల్‌బ్యాక్‌ను మనం చూడవచ్చు. ఈ క్రమంలో రూ.2,900 వద్ద అమ్మటానికి అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి ముగింపు ప్రాతిపదికన రూ.3,530 స్టాప్ లాస్ గా శుక్లా నిర్ణయించారు. ప్రస్తుతం షేరు ధర రూ.3,179.05 వద్ద మార్కెట్లో ట్రేడవుతోంది.

ఇన్ఫోసిస్..
ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్లో రూ. 1,620 స్వింగ్ హైని చూసిన తర్వాత హారింజాంటల్ లైన్ బ్రేక్‌డౌన్ ఇచ్చింది. ఇది ఇటీవలి స్వింగ్ హై నుంచి 15 శాతానికి పైగా పడిపోయింది. ఇటీవల షేర్లలో నమోదైన పదునైన అమ్మకాలు షేర్ విలువను ఇటీవల దిగువకు జార్చాయి. ఈ క్రమంలో స్టాక్ రూ.1,540 రేటు వద్ద రెసిస్టెన్స్ ఎదుర్కొంటుందని శుక్లా పేర్కొన్నారు. అయితే షేరుతో జాగ్రత్తగా ఉండాలన్న ఆయన రూ.1,330 మద్ధతు ధరగా నిర్ణయించారు. పైగా స్టాక్ 200-DMA స్థాయి అయిన రూ. 1,250 స్థాయికి తిగిరి జారిపోవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం స్టాక్ ధరు రూ.1,408.70 వద్ద ట్రేడవుతోంది.
విప్రో..
ప్రస్తుతం విప్రో షేరు రోజువారీ, వారపు చార్ట్‌లలో బేరిష్ సిగ్నల్‌లు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో స్టాక్ రూ.375-380 జోన్‌పై నిర్ణయాత్మక ముగింపుని ఇచ్చే వరకు.. షేర్ రూ.330-320 స్థాయిలకు దిగువకు జారడం కొనసాగుతుందని శుక్లా అంచనా వేశారు. ప్రస్తుతం మార్కెట్లో షేరు ధర రూ.364.20 వద్ద ఉంది. ప్రస్తుతం స్టాక్ టార్గెట్ ధరను రూ.320గా ఆయన నిర్ణయించారు. స్టాక్ కు సెల్ రేటింగ్ ఇచ్చారు.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం నిపుణుల అభిప్రాయం మాత్రమే. దీనితో గుడ్ రిటర్న్స తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. వాటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications