Multibagger Stock: ఇటీవల ర్యాలీ ముగిసిన తర్వాత సైతం డిఫెన్స్ స్టాక్ తన లాభాల పయనాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందించింది.
ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ షేర్లు గత మూడేళ్ల కాలంలో మల్టీబ్యాగర్ రాబడులను అందించాయి. 2020 జూలై 31న రూ.108.55గా ఉన్న కంపెనీ షేర్ ధర నేడు రూ.1,038.80 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఈకాలంలో ఏగకంగా 825 శాతం రాబడిని అందించింది. మూడేళ్ల కిందట ఎవరైనా ఈ కంపెనీలో లక్ష ఇన్వెస్ట్ చేసి ఇప్పటి వరకు కొనసాగించి ఉన్నట్లయితే దాని విలువ రూ.9.57 లక్షలకు చేరుకుని ఉండేది.

జూలై 19న కంపెనీ తన మెుదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. రక్షణ సంస్థ జూన్ త్రైమాసిక లాభం ఏడాది ప్రాతిపదికన ఆరు రెట్లు పెరిగింది. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ జూన్ త్రైమాసికంలో రూ.8.21 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.1.26 కోట్ల లాభాన్ని పొందింది. చివరి త్రైమాసికంలో ఆదాయం 2022 జూన్ త్రైమాసికంలో రూ.51.77 కోట్ల నుంచి రూ.61.95 కోట్లకు పెరిగింది. జూన్ త్రైమాసికంలో ముగ్గురు ప్రమోటర్లు కంపెనీలో 41.33 శాతం వాటాలను కలిగి ఉన్నారు.

ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ అనేది పారిశ్రామిక పేలుడు పదార్థాల్లో ప్రత్యేకత కలిగిన కంపెనీ అని డిఫెన్స్ స్టాక్ ఔట్‌లుక్‌పై ప్రొఫిషియెంట్ ఈక్విటీస్ CEO మనోజ్ దాల్మియా అన్నారు. ఇది ఇస్రో, డీఆర్డీఓ వంటి సంస్థల కోసం ఆపరేషన్స్ & నిర్వహణ సేవలను అందిస్తోంది. కంపెనీ'మేక్ ఇన్ ఇండియా' రక్షణ విధానానికి అనుగుణంగా ఉన్నందున.. ఆఫ్‌సెట్ బాధ్యతలను నెరవేర్చడానికి OEMలతో సహకరించడం దీని లక్ష్యం. కంపెనీ ప్రధానంగా రక్షణ, అంతరిక్షం, మైనింగ్, మౌలిక సదుపాయాల పరిశ్రమల కోసం అధిక శక్తి పదార్థాలు, అనుబంధ ఉత్పత్తుల తయారీలో నిమగ్నమై ఉంది. రాకెట్ల కోసం సాలిడ్ ప్రొప్పెల్లెంట్స్, ఉపగ్రహ ప్రయోగ వాహనాల కోసం స్ట్రాప్-ఆన్ మోటార్లను అభివృద్ధి, తయారు చేయడంపై దృష్టి సారించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications