Gold: బంగారం కొని నగలు చేయించాలా లేక చేసిన నగలే కొనుగోలు చేయాలా..!

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం కూడా పసిడి ధరలు పెరిగాయి. అయితే బంగారం ధర పెరిగినా కొనుగోలు ఆగడం లేదు. ముఖ్యంగా పెళ్లిళ్లు ఉన్నవారు పసిడి కొనుగోలు చేయక తప్పడం లేదు. అయితే బంగారం కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది. బిస్కెట్ బంగారం కొనుగోలు చేసి ఆభరణాలు చేయించడం మంచిదా లేక షాప్ కు వెళ్లి డైరెక్ట్ గా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం మంచిదా అనే సందేహాలు చాల మందికి ఉంటాయి. అయితే బంగారం కొనుగోలు చేసి ఆభరణాలు చేయిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

మనం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కొనుగోలు చేస్తాం. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,930 వద్ద ట్రేడవుతోంది. దీనికి 3 శాతం జీఎస్టీ అదనం. అంటే మీరు తులం బంగారాన్ని కొనుగోలు చేయ్యాలంటే.. దాదాపు రూ.1,60,000 పైనే చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్వచ్ఛమైన పసిడితో ఆభరణాలు చేయడం కుదరదు. అప్పుడు అందులో రాగి కలుపుతారు. అప్పుడు ఆభరణాలు తయారు చేస్తారు. ఈ క్రమంలో స్వచ్ఛత తేడా వచ్చే అవకాశం ఉంటుంది. తరుగు పేరుతో కూడా కొంత మొత్తం తీస్తారు. ఇలా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు ఇష్టమైన స్టైల్ లో ఆభరణాలు చేయించుకోవచ్చు. మేకింగ్ ఛార్జీలు కూడా ఉంటాయి.

Gold

అయితే గతంలో అందరు స్వర్ణకారుల వద్ద ఆభరణాలు చేయించుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నగల షాపుల్లో కొనుగోలు పెరిగింది. షోరూమ్‌లలో మెషిన్ కటింగ్ డిజైన్లు చాలా అందంగా, నాణ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీఐఎస్ హాల్ మార్కింగ్ ఉండటం వల్ల ప్యూరిటీలో గ్యారెంటీ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పండుగల సమయాల్లో ఆఫర్లు ప్రకటించినప్పుడు మేకింగ్ ఛార్జీలపై డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంటుంది. పక్కా బిల్లు ఉండటం వల్ల భవిష్యత్తులో విక్రయించాలన్నా, ఎక్చ్సేంజ్ చేయాలన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా మీరు 22 క్యారెట్ల ధరను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి పన్ను కూడా అదనంగా ఉంటుంది.

అయితే ఇక్కడ మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు రాళ్లు ఉన్న నగలు కొంటే, బంగారం బరువులో ఆ రాళ్ల బరువును కూడా కలిపి ధర వసూలు చేసే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నమ్మకమైన స్వర్ణకారుడు ఉంటే రా బంగారం కొనుగోలు చేసి ఆభరణాలు చేయించడం బెటర్ లేకుంటే.. షాపుల్లో కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+