గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయి లాభాలను అందించిన బంగారం (Gold), వెండి (Silver) ధరలు ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి. ఫిబ్రవరి 10 నాటికి, ఎంసీఎక్స్ (MCX) మార్కెట్ లో బంగారం ధరలు సుమారు 10-18 శాతం వరకు, వెండి ధరలు ఏకంగా 35-37 శాతం వరకు గరిష్ట స్థాయిల నుంచి పడిపోయాయి. ఈ ధరల పతనం కొత్త ఇన్వెస్టర్లకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తోందా? లేదా ఇంకా వేచి చూడాలా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టేందుకు ETF (ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) అనేవి బెస్ట్ ఆప్షన్స్. వీటి ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండా సులువుగా బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చు. వీటి వాల్యూ బంగారం ధరలకు అనుగుణంగా మారుతుంటుంది. అయితే ఇప్పుడు ఈ ఈటీఎఫ్ లలోకి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి.
జనవరిలో వెల్లువెత్తిన పెట్టుబడులు
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) తాజా గణాంకాల ప్రకారం.. జనవరి 2026లో గోల్డ్ ETFలలోకి రికార్డు స్థాయిలో రూ. 24,039.96 కోట్ల నికర నిధులు వచ్చాయి. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఎంతలా మొగ్గు చూపుతున్నారో ఈ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ధరలు తగ్గిన నేపథ్యంలో గతంలో పెరిగిన ధరల వల్ల పెట్టుబడి పెట్టలేకపోయిన వారికి ఇది ఒక మంచి ఎంట్రీ పాయింట్ అని కోటక్ మ్యూచువల్ ఫండ్ నిపుణులు సతీష్ దొండపాటి అభిప్రాయపడుతున్నారు.
వెండి విషయంలో జాగ్రత్త అవసరమా?
బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో ఒడిదుడుకులు (Volatility) ఎక్కువగా ఉన్నాయి. వెండి ధరలు భారీగా పడిపోవడంతో ప్రస్తుతం మార్కెట్లోని దాదాపు అన్ని సిల్వర్ ETF లు వాటి నెట్ అసెట్ వ్యాల్యూ (NAV) కంటే 5 నుండి 7 శాతం డిస్కౌంట్‌లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా సిల్వర్ ETF, నిప్పాన్ ఇండియా సిల్వర్ ETF వంటి వాటిలో ట్రేడింగ్ వాల్యూమ్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కొత్తగా పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మిరే అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ నిపుణుడు సిద్ధార్థ్ శ్రీవాస్తవ ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్-రివార్డ్ పరంగా వెండి కంటే బంగారంపై పెట్టుబడి పెట్టడమే మేలనిపిస్తుంది.
ఇన్వెస్టర్లు ఏమి చేయాలి?
మార్కెట్ నిపుణులు ఇచ్చే ప్రధాన సలహా ఏమిటంటే.. తక్కువ సమయంలో ఎక్కువ లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడి పెట్టాలి. ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉన్నందున ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) పద్ధతిలో ETF లలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. దీనివల్ల ధరల ఒడిదుడుకుల నుండి రక్షణ లభిస్తుంది.
మొత్తంగా చూస్తే మీ పోర్ట్‌ఫోలియోలో ఆస్తుల కేటాయింపు (Asset Allocation) సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మొత్తం డబ్బును ఒకే చోట పెట్టకుండా బంగారం , వెండి ETF ల మధ్య సమతుల్యం పాటించడం వల్ల రిస్క్ తగ్గుతుంది. మార్కెట్ ఒడిదుడుకులను చూసి ఆందోళన చెందకుండా.. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానమే మీకు దీర్ఘకాలంలో స్థిరమైన లాభాలను అందిస్తుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications