ఆపిల్ ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ తీసుకొస్తుంది కానీ Pro మోడల్స్‌లో వచ్చే మార్పులే అందరినీ ఎక్కువ ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఐఫోన్ 17 Pro వచ్చేసింది. ఇందులో పూర్వపు మోడల్స్‌తో పోలిస్తే 5 ముఖ్యమైన అప్‌డేట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం.
1. అల్యూమినియం యూనిబాడీ డిజైన్:
గత ఏడాది Pro మోడల్స్ టైటానియం డిజైన్‌తో వచ్చాయి. కానీ ఈసారి ఆపిల్ అల్యూమినియం యూనిబాడీకి మారింది. బ్యాక్ మొత్తం గ్లాస్ కాకుండా మధ్యలో ఆపిల్ లోగో ఉన్న చోట మాత్రమే గ్లాస్ ఉంది. దీని వల్ల ఫోన్ డ్యూరబుల్‌గా ఉంటుంది, హీట్ మేనేజ్‌మెంట్ కూడా బాగుంటుంది అని నిపుణులు అంటున్నారు.

2. బ్యాటరీ లైఫ్:
కొత్త డిజైన్ వల్ల ఐఫోన్ 17 Proలో బ్యాటరీ సైజ్ కూడా పెరిగింది. అందుకే ఇప్పుడు బ్యాటరీ లైఫ్ మరింత బెటర్‌గా వచ్చింది. ఉదాహరణకు, Pro Max మోడల్‌తో సుమారు 37 గంటల పాటు వీడియోలు ప్లే చేయొచ్చు, Pro మోడల్ అయితే 31 గంటల వరకు ఇస్తుంది. అంతే కాదు, 40W USB-C అడాప్టర్ వాడితే కేవలం 20 నిమిషాల్లోనే 50% చార్జ్ అవుతుంది. అంటే, చిన్న బ్రేక్‌లోనే ఫోన్ హాఫ్ చార్జ్ అయిపోతుంది. ఇది నిజంగా ఒక గేమ్‌చేంజర్‌నే చెప్పాలి.
3. కెమెరా అప్గ్రేడ్స్:
ఈసారి మూడు కెమెరాలు (మెయిన్, అల్ట్రా-వైడ్, టెలిఫోటో) అన్నీ "48MP" వచ్చాయి. కొత్త సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఆపిల్ చెప్పినట్టే "ఇది ఉంటె జేబులోనే 8 ప్రో లెన్సులు ఉన్నట్టే". కానీ ఒక చిన్న డౌన్‌గ్రేడ్ కూడా ఉంది. iPhone 16 Proలో 5x ఆప్టికల్ జూమ్ ఉండేది. ఈసారి మాత్రం 4x వరకు మాత్రమే ఉంది.
4. డిస్‌ప్లే & సేఫ్టీ
ఐఫోన్ 17 Pro స్క్రీన్ 6.3 అంగుళాలు, Pro Max 6.9 అంగుళాలు. కొత్త "సిరామిక్ షీల్డ్ 2" వల్ల స్క్రాచ్ రెసిస్టెన్స్ 3 రెట్లు పెరిగింది. అలాగే కొత్త anti-reflection coating గ్లేర్ తగ్గిస్తుంది అంటే లైట్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనపడుతుంది.
5. కొత్త కలర్స్:
ఇప్పటివరకు Pro మోడల్స్ ఎక్కువగా బ్లాక్, గ్రే, వైట్ కలర్స్ లోనే వచ్చేవి. ఈసారి ఆపిల్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చి "కాస్మిక్ ఆరెంజ్" అనే బ్రైట్ కలర్ తీసుకొచ్చింది. దీన్ని చూసి ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అదనంగా డార్క్ బ్లూ, సిల్వర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
ఐఫోన్ 17 Proలో ప్రాసెసర్ కూడా పెద్ద అప్‌డేట్ అయ్యింది. కొత్త A19 Pro చిప్ వేగవంతమైన CPU, GPU పనితీరుతో వస్తుంది, కాబట్టి యాప్‌లు ఓపెన్ చేయడం, గేమింగ్, మరియు సాధారణ పనులు స్మూత్‌గా జరుగుతాయి. iOS 26తో కలిపి పవర్ మేనేజ్‌మెంట్ మరింత సమర్థవంతంగా మారింది, ఫోన్ ఎక్కువ పనిచేస్తూ కూడా వేడెక్కదు. స్క్రీన్ కూడా చాలా ఆకట్టుకుంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో స్మూత్ స్క్రోలింగ్, గేమ్స్, వీడియోలు చూడడానికి అత్యంత బాగుంది. ProMotion టెక్నాలజీ మరింత మెరుగ్గా అందుబాటులో ఉంది.
మొత్తానికి, కొత్త కలర్, కొత్త డిజైన్, బెస్ట్ బ్యాటరీ, అప్‌గ్రేడ్ కెమెరా, మెరుగైన స్క్రీన్ ఇవన్నీ కలిపి ఐఫోన్ 17 Proని మరింత ప్రత్యేకంగా చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications