Market Holiday: భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారులు ప్రస్తుతం గందరగోళంలో ఉన్నారు. వాస్తవానికి ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు సోమవారం ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉంటాయా లేక సెలవులో ఉంటాయా అనే అనుమానం చాలా మందిలో ఉంది. దీనికి కారణం హిందువులు జరుపుకునే శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సోమవారం అంటే ఆగస్టు 26, 2024న రావటమే ఈ గందరగోళానికి కారణం.
భారత స్టాక్ మార్కెట్లు గడచిన వారాన్ని లాభాలతో విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత కొంతమంది స్టాక్ ఇన్వెస్టర్లు, దలాల్ స్ట్రీట్ ఔత్సాహికులు తిరిగి ట్రేడింగ్ ప్రారంభమైన రోజు గురించి ఆలోచిస్తున్నారు. దీంతో జన్మాష్టమి రోజున సెలవు గురించి ఎన్ఎస్ఈ, బీఎస్ఈ వెబ్‌సైట్‌లో సెలవుల జాబితాను పరిశీలిస్తే.. ఆగస్ట్ నెలలో కేవలం ఒక ట్రేడింగ్ సెలవుదినం 15 ఆగస్టు 2024న మాత్రమే సెలవుదినంగా ఉంది. దీని తర్వాత సెలవుదిన అక్టోబర్ 2, 2024న ఉంది. ఈ లెక్కన సోమవారం అంటే ఆగస్టు 26న భారతీయ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారుల ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉండనున్నాయని వెల్లడైంది. అంటే BSE, NSE కార్యకలాపాలు సోమవారం సాధారణంగా కొనసాగుతాయి.

ఇక 2024లో మిగిలి ఉన్న స్టాక్ మార్కెట్ల సెలవుదినాలను పరిశీలిస్తే కేవలం 4 మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. 2 అక్టోబర్ 2024న ఉన్న మహాత్మా గాంధీ జయంతి, 1 నవంబర్ 2024న దీపావళికి, 15 నవంబర్ 2024న గురునానక్ జయంతితో పాటు చివరిగా 25 డిసెంబర్ 2024న క్రిస్మస్‌కు సెలవుల జాబితాలో ఉన్నాయి. 2024లో మెుత్తం స్టాక్ మార్కెట్లు కేవలం 15 రోజులు మాత్రమే సెలవులను అధికారికంగా ఉన్నాయి.
గడచిన వారం జాక్సన్ హోల్ సమావేశంలో యూఎస్ ఫెడ్ చైర్ పర్సన్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్ల తగ్గింపుకు ఇక సమయం ఆసన్నమైందని అన్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి రావటం వల్ల ఆర్థిక మాంద్యం భయాలు తొలగిపోయాయని అనటంపై ట్రేడర్లు సంతోషంలో ఉన్నారు. త్వరలోనే వడ్డీ రేట్ల తగ్గింపులు ఉంటాయని వారు భావిస్తున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఒకవేళ వడ్డీ రేట్లను తగ్గించటం ప్రారంభిస్తే అదే దారిలో భారతీయ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కూడా వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియకు శ్రీకారం చుడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications