చిన్న పొదుపు పథకాల కింద ప్రభుత్వం నిర్వహిస్తున్న సేవింగ్స్ స్కింలలో సుకన్య సమృద్ధి యోజన (SSY) చాల పాపులర్ అయ్యింది. ఈ పథకం కింద ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి కూతురి చదువు, పెళ్లి కోసం డబ్బు సేవింగ్స్ చేయవచ్చు. ఈ పథకంపై అందించే వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. అయితే తాజాగా ప్రభుత్వం ఏప్రిల్-జూన్ 2025 త్రైమాసికానికి ఈ పథకం వడ్డీ రేటును సమీక్షించి ఎప్పటిలాగే పాత స్థాయిలోనే కొనసాగించింది.

సుకన్య సమృద్ధి యోజన అంటే ఏమిటి: సుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ప్రభుత్వం అందించే ప్రత్యేక పథకం. 'బేటీ బచావో, బేటీ పఢావో' ప్రచారం కింద దీన్ని ప్రారంభించారు. ఈ పథకం ఉద్దేశ్యం ఆడపిల్లల భవిష్యత్తును సురక్షితం ఉంచడం. ఈ పథకం కింద తల్లిదండ్రులు వారి కూతురి కోసం డబ్బు సేవింగ్స్ చేయవచ్చు. ఈ డబ్బును పిల్లల చదువు లేదా పెద్దయ్యాక పెళ్ళికి వినియోగించుకోవచ్చు.
వడ్డీ రేటు ఎంతంటే : చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. దింతో ఇప్పుడు 2025 ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉన్న త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజన (SSY) వడ్డీ రేటును ప్రభుత్వం మార్చలేదు. అలాగే ఈ వడ్డీ రేటు 8.2% వద్దనే ఉంచింది. పోస్టాఫీసులోని ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే దీని వడ్డీ రేటు ఎక్కువ.
ఎంత డబ్బు డిపాజిట్ చేయవచ్చు: సుకన్య సమృద్ధి యోజన (SSY)లో డిపాజిట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ పథకం కింద అకౌంట్ తెరవడానికి ఏడాదికి కనీసం రూ.250 ఇన్వెస్ట్ చేయాలి. ఈ మొత్తం కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రతి ఒక్క కుటుంబం ఈజీగా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలంటే ప్రతి సంవత్సరం కనీసం రూ. 250 డిపాజిట్ చేయాలి. ఒక సంవత్సరంలో అత్యధికంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఈ మొత్తం కూడా ఒకేసారి డిపాజిట్ చేయవచ్చు.
వడ్డీ ఇంకా మెచూరిటీ ప్రయోజనాలు:సుకన్య సమృద్ధి యోజనలో జమ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతి సంవత్సరం కలుపుతారు. ఈ వడ్డీ పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ. ఈ అకౌంట్ మెచూరిటీ అయినప్పుడు పెట్టుబడి మొత్తంతో వడ్డీ మొత్తం టాక్స్ ఫ్రీగా ఉంటుంది. ఈ పథకం కాలపరిమితి 21 సంవత్సరాలు లేదా మీ కుమార్తె పెళ్లి వరకు, ఏది ముందు అయితే అది పరిగణిస్తారు.
సుకన్య సమృద్ధి యోజన కింద ఒక ప్రత్యేక సౌకర్యం ఏమిటంటే మీరు మీ కుమార్తె చదువు కోసం కూడా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. మీ కుమార్తెకు 18 సంవత్సరాలు నిండినప్పుడు లేదా 10వ తరగతి పాసైనాక కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే గత ఆర్థిక సంవత్సరం చివరిలో అకౌంట్లో ఉన్న మొత్తంలో 50% వరకు మాత్రమే మీరు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా ప్రతి సంవత్సరం వాయిదాలలో అంటే 5 సంవత్సరాలలో విత్ డ్రా చేసుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications