Loan: అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడానికి పర్సనల్ లోన్ తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తుంటారు. అయితే వీటిని పొందటానికి మంచి క్రెడిట్ హిస్టరీ తప్పనిసరి. లేనివారు అధిక వడ్డీ రేట్లతో ఈ రుణాలను పొందాల్సి ఉంటుంది.
అలాగే ప్రాపర్టీ ఉండే వ్యక్తులు దానిని బ్యాంకులో తనఖా పెట్టి రుణాలను పొందవచ్చు. పైగా ఇందులో పర్సనల్ లోన్ కంటే తక్కువ వడ్డీ రేట్లకు రుణాన్ని తీసుకోవచ్చు. అలాగే బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి సైతం రుణాన్ని పొందవచ్చు. గోల్డ్ లోన్ పర్సనల్ లోన్ కంటే తక్కువ వడ్డీకి రుణాలను పొందుతారు. బంగారు ఆభరణాలపై ఉన్న అప్పును ఏడాది చివరిలో తీరుస్తే సరిపోతుంది. నెలవారీ వడ్డీ వసూలు చేస్తే చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది. అంటే 12 నెలల తర్వాత గడువు తేదీలో మీరు మొత్తం కట్టినట్లయితే మీరు మరింత చెల్లించాలి.

ఆస్తులపై రుణం తీసుకోవడం కొంచెం కష్టం. దీనికోసం లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, క్లియర్ టైటిల్స్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాత బ్యాంకులు తనఖా రుణాన్ని అందిస్తుంటాయి. అందువల్ల ప్రాపర్టీ రుణం పొందటం కంటే.. ఆభరణాలపై రుణం తీసుకునే ప్రక్రియ చాలా సులభమైనది. కానీ ఆస్తులపై రుణం తీసుకోవడంలో సంక్లిష్టమైన విధానాల కారణంగా.. కోరుకున్న సమయంలో బ్యాంకుల నుంచి రుణం పొందడం సాధ్యం కాదు. అత్యవసరంగా నిధులు అవసరం ఉండే సమయాల్లో ఎక్కువ కాలం వేచి ఉండటం కుదరదు కాబట్టి ఇది సరైన రుణ ఎంపిక కాదని చెప్పుకోవచ్చు.
ఇవి కాకుండా ప్రైవేటు వ్యక్తుల నుంచి కూడా రుణాన్ని పొందవచ్చు. అయితే ఇందులో వడ్డీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గిట్టుబాటు కాదు. ఆర్థికంగా ఇది ఎక్కువ భారాన్ని కలిగిస్తుంది. పెద్ద మెుత్తంలో రుణం పొందాలనుకున్నప్పుడు అంత స్థాయిలో బంగారం ఉండదు కాబట్టి.. అలాంటప్పుడు ఆస్తిని ఉంచుకుని మనకు అవసరమైన డబ్బును బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకోవచ్చు. అందువల్ల మీకు ఉన్న డబ్బు అవసరం, అత్యవసర పరిస్థితి, రుణ మెుత్తం వంటి వివరాలను పరిగణలోకి తీసుకుని రెండింటిలో ఏది అనుకూలంగా ఉంటే దానిని ఎంపిక చేసుకోవటం ఉత్తమం.


Click it and Unblock the Notifications