China in Bangla violence: తాజాగా బంగ్లాదేశ్‌లో ఏర్పడిన సంక్షోభం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్త హాట్ టాపిక్ గా మారింది. అంతర్గత తిరుగుబాటుతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి వెళ్ళిపోవడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతుంది. ఇటీవల భారత్ చుట్టుపక్కల ఉన్న సరిహద్దు దేశాల్లో వరుసగా ఇదే తరహా ఘటనలు ఎక్కువ జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆయా దేశాల సాధారణ అల్లర్లు కాకుండా చైనా కుట్ర కోణం ఏమైనా ఉందా అనే చర్చ జరుగుతుంది.
ఈ తరహా అభిప్రాయానికి రావడానికి కారణాలు లేకపోలేదు. గతంలో ప్రపంచ తయారీ దిగ్గజంగా పేరుగాంచిన చైనా ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతుంది. ఆయా దేశాలు అరకొర వృద్ధిని సాధించడంలో అష్ట కష్టాలు పడుతుండగా డ్రాగన్ శత్రుదేశం ఇండియా మాత్రం రాకెట్ స్పీడ్‌తో ముందుకెళ్తోంది. ఇదే సమయంలో చైనాలోని ప్రముఖ సంస్థలు భారత్ తరలివెళ్లడం డ్రాగన్‌కు ఇబ్బంది కలిగించే అంశం. గతంలోనూ శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, టిబెట్ వంటి దేశాల్లో ఇండియా వ్యతిరేకతను పురికొల్పిన దాఖలాలు ఉన్నాయి.

బంగ్లాదేశ్ తో భారత్‌కు కేవలం సాంస్కృతిక సంబంధాలే కాకుండా వ్యాపార, వాణిజ్య లావాదేవీలు అధికం. ఆ దేశం దాదాపు పూర్తిగా భారత్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. ఇక్కడి టెక్స్టైల్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. భారత ప్రభుత్వాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలని చూస్తున్న చైనా.. రిజర్వేషన్ల పేరిట ఇక్కడ అంతర్యుద్ధానికి సైలెంట్ గా బీజం వేసి ఉండవచ్చని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా దాని ప్రభావం భారత్ పై ఉండనే ఉంటుందని అందరికీ తెలుసిన విషయమే.
బంగ్లాలో భారత ప్రభుత్వ పెట్టుబడులే కాకుండా అదానీ వంటి ప్రైవేట్ వ్యాపార దిగ్గజాలు వేలాదికోట్లు కుమ్మరించారు. ప్రస్తుత ఘటనలతో ఆ పెట్టుబడులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడింది. ఇదికాస్తా డ్రాగన్ దేశానికి కన్నుల పండుగ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. భారత్ ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని బోర్డర్ దగ్గర వితండవాదం చేస్తుంటే ఇండియా గట్టిగా బదిలిస్తుంది. దౌత్యపరంగా పోటీకి స్టామినా సరిపోవడం లేదు. ఈ పరిస్థితుల్లో పరోక్ష హింసావాద చర్యలు మినహా ఇంకేమీ ఊహించలేమని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications