ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. ఉక్రెయిన్‌లో వేర్పాటువాదుల ఆదీనంలోని దొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల స్వాతంత్రాన్ని రష్యా గుర్తించింది. అక్కడికి రష్యా సేనలు వెళ్లడంపై అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాజకీయ పలుకుబడిన కలిగిన రష్యా వ్యాపారవేత్తలు, బ్యాంకులపై ఆర్థిక ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించాయి. దీంతో రష్యా పాశ్చాత్య దేశాల్లో పెట్టుబడులు, రుణాలను సమీకరించే వెసులుబాటు లేకుండా ప్రయత్నించాయి.
అమెరికా మరిన్ని ఆంక్షలకు సిద్ధంగా ఉంది. కానీ అమెరికా ఆంక్షలకు పుతిన్ వెనుకడుగు వేయడం లేదు. ఉక్రెయిన్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు రష్యా, రష్యాను ఆర్థికంగా, వాణిజ్యపరంగా ఇబ్బందులు పెట్టేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.

మాస్కోకు బీజింగ్ మద్దతు
ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై ప్రపంచం దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కానీ మాస్కోకు బీజింగ్ కీలక మద్దతుదారుగా ఉంది. అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాను వాణిజ్యపరంగా చిక్కుల్లోకి నెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, చైనా పుతిన్‌కు ఆయువుపట్టుగా భావిస్తున్నారు. మాస్కోపై అంతర్జాతీయ సమాజం ఆంక్షలు విధించినప్పటికీ ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి, రష్యాపై ఒత్తిడిని తగ్గించే కీలక దేశంగా చైనా నిలిచింది.
ఇందులో భాగంగా రష్యన్ గోధుమ ఎగుమతులపై పరిమితులను ఎత్తివేస్తున్నట్లు చైనీస్ అధికారులు గురువారం ప్రకటించారు. ప్రపంచ సరఫరాలో ఈ వాటా నాలుగు శాతం ఉంటుంది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జీజిన్‌పింగ్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ, ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఈ ప్రకటన గమనార్హం.

లైఫ్ లైన్ విసరడమా
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఈ చర్యలను తప్పుబట్టారు. రష్యా మరో దేశంపై దాడి చేస్తున్న సమయంలో బీజింగ్ లైఫ్ లైన్ విసరడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇది మద్దతుకు సంకేతమని ఆసియా పసిఫిక్ చీఫ్ ఎకనమిస్ట్ అలిసియా గార్సియా హెర్రెరో అన్నారు. రష్యా చర్యలను దండయాత్రగా అభివర్ణించేందుకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నిరాకరించారు. పైగా, అమెరికా అగ్గిరాజేస్తోందని వ్యాఖ్యానించారు.

చైనా-రష్యా చెట్టాపట్టాల్
2014లో క్రిమియాను రష్యా ఆక్రమించినప్పుడు పాశ్చాత్య దేశాల కూటమి ఆంక్షలు విధించింది. అప్పుడు రష్యా ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. రూబుల్ పతనమైంది. రష్యా కేంద్ర బ్యాంకు అపారంగా విదేశీ మారక ద్రవ్యాన్ని గుమ్మరించింది. ఆ తర్వాత ఆర్థికస్థితి మెరుగుపడింది. ఇప్పుడు రష్యా వద్ద 63,500 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం, బంగారం నిల్వలు ఉన్నాయి. కాబట్టి ఈ యుద్ధం తాత్కాలికంగా ఇబ్బందికరంగా మారినా, తర్వాత నష్టం లేదని భావిస్తోంది.
అంతేకాదు, గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఆర్థిక ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి అమెరికన్ డాలర్ పైన ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ వస్తోంది. 2018లో ట్రంప్ ప్రభుత్వం ప్రారంభించిన వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు చైనా కూడా డాలర్ ట్రాన్సాక్షన్స్‌ను కుదించింది.

డాలర్ ఆధిపత్యం తగ్గింపు కోసం...
రష్యా రూబుల్, చైనా యువాన్‌లను అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్‌కు విస్తరించాలని మూడేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నాయి. రష్యా 2013 నుండి తన విదేశీ మారక ద్రవ్య నిల్వలలో డాలర్ శాతాన్ని తగ్గించుకొని, యువాన్, యూరోల వాటాను పెంచుకుంటోంది. డాలర్, యూరో ట్రాన్సాక్షన్స్ లేకుండా చేయడం రష్యాకు ఇబ్బందికరమే. 2021 డిసెంబర్ నాటికి అంతర్జాతీయ చెల్లింపుల్లో 40 శాతానికి పైగా డాలర్లలో, 36 శాతానికి పైగా యూరోలలో, దాదాపు ఆరు శాతం బ్రిటిష్ పౌండ్లలో నిర్వహించింది.
చైనీస్ యువాన్ ట్రాన్సాక్షన్స్ మూడు శాతం లోపు ఉన్నాయి. ఇక రూబుల్ చెల్లింపులు పావు శాతం కూడా లేవు. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు చైనా డిజిటల్ యువాన్ దిశగా అడుగు వేస్తుండగా, రష్యా కూడా పావులు కదుపుతోంది.

స్విఫ్ట్ కోత ఉండకపోవచ్చు
ఉక్రెయిన్ పైన రష్యా దాడి నేపథ్యంలో మాస్కో బ్యాంకులను స్విఫ్ట్ వ్యవస్థ నుండి వెలి వేయాలని అమెరికా, యూరోపియన్ దేశాలు భావించాయి. వేలాది బ్యాంకులకు స్విఫ్ట్ కీలకం. రష్యాను స్విఫ్ట్ నుండి తప్పిస్తే క్రూడ్, సహజవాయు ఎగుమతులకు డాలర్ చెల్లింపులు లేక మాస్కో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. కానీ స్విఫ్ట్ నుండి తొలగింపు అంత ఈజీ కాదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ దేశాల పైన కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications