Budget 2026: పోర్టుల నుంచి గోదాముల వరకు..దేశంలో లాజిస్టిక్స్ విప్లవంపై మోదీ సర్కారు ఫోకస్

Budget 2026: భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. తయారీ రంగం, ఈ-కామర్స్, వ్యవసాయం, ఎగుమతులు ఇలా అన్ని రంగాల్లో వృద్ధి వేగంగా జరుగుతోంది. ఈ వృద్ధిని నిలబెట్టాలంటే బలమైన లాజిస్టిక్స్ వేర్‌హౌసింగ్ వ్యవస్థ చాలా అవసరం.లాజిస్టిక్స్ అంటే సరుకులను ఒక చోటు నుంచి మరో చోటుకు తక్కువ ఖర్చుతో, వేగంగా, సురక్షితంగా తరలించడం అని చెప్పవచ్చు. ప్రస్తుతం భారత్‌లో లాజిస్టిక్స్ ఖర్చు GDPలో సుమారు 13-14% ఉంటుంది. ఇది అమెరికా, చైనా లాంటి దేశాల కంటే ఎక్కువ. ఈ ఖర్చు తగ్గితే ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి, వినియోగదారులకు లాభం కలుగుతుంది.

గత కొన్ని ఏళ్లుగా భారతదేశ లాజిస్టిక్స్ రంగం నిశ్శబ్దంగా ముందుకు సాగిపోతోంది. ఒకప్పుడు దేశ GDPలో 13 నుంచి 14 శాతం వరకు ఉన్న లాజిస్టిక్స్ ఖర్చులు ఇప్పుడు జాతీయ లాజిస్టిక్స్ పాలసీ, ప్రధానమంత్రి గతి శక్తి, భారత్‌మాల, సాగరమాల వంటి కీలక విధానాల కారణంగా 8 శాతం కంటే తక్కువకు తగ్గాయి. ఇది ఒకప్పుడు కలలలో కూడా ఊహించని మైలురాయిగా చెప్పవచ్చు. అయితే ఇది ముగింపు కాదు.. భారతదేశ లాజిస్టిక్స్ కథలో ఇది ఒక శక్తివంతమైన ప్రారంభ దశ మాత్రమేనని చెప్పవచ్చు.

భారత్ వైపు కంపెనీల చూపు: భారతదేశం వేగంగా విస్తరిస్తున్న తయారీ కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో.. చైనా ప్లస్ వన్ వ్యూహం ద్వారా ప్రపంచ సరఫరా గొలుసులు అన్నీ భారతదేశం వైపు మళ్లుతున్నాయి. ఈ పరిస్థితిలో లాజిస్టిక్స్ రంగంలో తదుపరి వృద్ధి కేవలం రహదారులు, గిడ్డంగులు, పోర్టులు నిర్మించడం ద్వారా మాత్రమే సాధ్యం కాదు. మనం సృష్టించిన మౌలిక సదుపాయాలను ఎంత సమర్థవంతంగా, తెలివిగా, పర్యావరణహితంగా, మానవ కేంద్రితంగా వినియోగిస్తున్నామనే అంశమే అసలు కీలకం.

ఈ మార్పును నడిపించడానికి బడ్జెట్ 2026 ఒక కీలక మలుపుగా మారే అవకాశాన్ని కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారం.. భారతదేశ లాజిస్టిక్స్ భవిష్యత్తును రూపుదిద్దే పలు ముఖ్యమైన ప్రాధాన్యతలు బడ్జెట్‌లో ప్రత్యేక శ్రద్ధ పొందాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

మల్టీమోడల్ కనెక్టివిటీ: ప్రస్తుతం భారతదేశ సరుకు రవాణా అధికంగా రోడ్లపైనే ఆధారపడి ఉంది. దీని వల్ల ఇంధన ఖర్చులు, ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం గణనీయంగా పెరుగుతున్నాయి. వాస్తవానికి, సుదూర ప్రాంతాలు నుంచి బల్క్ సరుకుల కోసం రైలు, తీరప్రాంత షిప్పింగ్ చాలా తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ, మొదటి మైలు నుంచి చివరి మైలు వరకు కనెక్టివిటీ సమస్యల వల్ల ఈ మార్గాలు పూర్తిగా వినియోగంలోకి రావడం లేదు.

బడ్జెట్ 2026లో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కుల నిర్మాణానికి వేగం ఇవ్వడంతో పాటుగా రైలు-రోడ్డు-పోర్ట్ అనుసంధానాన్ని మెరుగుపరచడం, ఇంటిగ్రేటెడ్ కార్గో టెర్మినల్స్‌ను అభివృద్ధి చేయడం అత్యంత కీలకం కావాలి. ఇది కేవలం ఖర్చులు తగ్గించడమే కాకుండా, భారత ఎగుమతుల పోటీతత్వాన్ని కూడా గణనీయంగా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

సాంకేతికత: ULIP (Unified Logistics Interface Platform) వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ప్రభుత్వ విభాగాలు, పోర్టులు, రైల్వేలు, కస్టమ్స్ మధ్య సమాచార మార్పిడిని సులభతరం చేశాయి. అయితే వాస్తవంలో, లాజిస్టిక్స్ రంగంలోని పెద్ద శాతం MSMEలు, చిన్న ట్రాన్స్‌పోర్టర్లు ఇంకా మాన్యువల్ విధానాలపైనే ఆధారపడుతున్నారు. దీంతో ఈ రంగంలో ముందుకు వెళ్లడం చాలా ఆలస్యంగా సాగుతుందని చెప్పవచ్చు.

కాబట్టి రవాణా నిర్వహణ వ్యవస్థలు (TMS), గిడ్డంగి నిర్వహణ వ్యవస్థలు (WMS), IoT ఆధారిత ట్రాకింగ్, డిజిటల్ డాక్యుమెంటేషన్ వంటి సాంకేతిక పరిష్కారాలను స్వీకరించేందుకు బడ్జెట్ లక్ష్యిత ప్రోత్సాహకాలు ఇవ్వాలి. డిజిటల్ లాజిస్టిక్స్ రంగం కేవలం వేగవంతమైనదే కాదు..అది మరింత పారదర్శకంగా, నమ్మదగినదిగా, MSMEలకు అందుబాటులో ఉండేలా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పర్యావరణానికి అనుకూలంగా ఆర్థిక సంకేతాలు: లాజిస్టిక్స్ రంగంలో స్థిరత్వం గురించి మాట్లాడితే.. మాటల కంటే విధానపరమైన సంకేతాలు చాలా ముఖ్యం. రైలు, తీరప్రాంత రవాణా.. రోడ్డు రవాణా కంటే చాలా తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తాయి. అయినప్పటికీ, ప్రస్తుతం GST విధానంలో అన్ని రవాణా మార్గాలకు సమాన పన్ను విధానం అమలులో ఉంది. పర్యావరణహిత రవాణా మోడ్‌లకు తక్కువ పన్నులు లేదా ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా సహజంగానే మోడల్ షిఫ్ట్ వేగవంతమవుతుంది. అదనంగా, EV ట్రక్కులు, ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడితే, పట్టణ, సుదూర డెలివరీ వ్యవస్థలు మరింత స్థిరంగా మారతాయి.

లాజిస్టిక్స్ వ్యవస్థకు డ్రైవర్లే నిజమైన వెన్నెముక: లాజిస్టిక్స్ రంగం గురించి మాట్లాడేటప్పుడు అందరూ తరచుగా మర్చిపోతున్న అంశం ఏదైనా ఉందంటే అది డ్రైవర్లు. ద్విచక్ర వాహనాలపై చివరి మైలు డెలివరీ చేసే యువకుల నుండి వేల కిలోమీటర్లు ప్రయాణించే ట్రక్ డ్రైవర్ల వరకు.. వీరే భారత సరఫరా గొలుసుకు ప్రాణంగా నిలబడుతున్నారు. కానీ నైపుణ్యం కలిగిన డ్రైవర్ల కొరత, పనిగంటల ఒత్తిడి, భద్రతా సమస్యలు, గౌరవాభావం ఈ రంగాన్ని వెంటాడుతున్నాయి.

బడ్జెట్ 2026లో డ్రైవర్ల అభివృద్ధిని జాతీయ మౌలిక సదుపాయాలుగా పరిగణించాలి. ప్రామాణిక శిక్షణ, సర్టిఫికేషన్, విశ్రాంతి కేంద్రాలు, శుభ్రమైన పార్కింగ్, ఆరోగ్య సదుపాయాలు, వేధింపులు లేని పని వాతావరణం వంటి అంశాల్లో భారీ పెట్టుబడులు ఎంతైనా అవసరం. మానవ దృష్టి లేకుండా, ఎంత ఆధునిక సాంకేతికత ఉన్నా లాజిస్టిక్స్ వ్యవస్థ సంపూర్ణంగా పనిచేయదని గుర్తించుకోవాలి.

ఇతర మార్గాలు కూడా చాలా అవసరం: ఇక వేర్‌హౌసింగ్ రంగాన్ని చూసుకుంటే సరుకులను నిల్వ చేయడానికి ఆధునిక గోదాములు లేకపోతే వ్యవసాయ ఉత్పత్తులు వృథా అవుతాయి. రైతులు నష్టపోతారు. కోల్డ్ స్టోరేజీలు, స్మార్ట్ వేర్‌హౌసులు ఉంటే ఆహార వృథా తగ్గుతుంది, రైతుల ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ-కామర్స్ వృద్ధి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో లాంటి కంపెనీలకు వేగవంతమైన డెలివరీ అవసరం. ఇది మంచి లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ లేకుండా సాధ్యం కాదు. Tier-2, Tier-3 నగరాల్లో గోదాములు పెరగడం వల్ల స్థానికంగా ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయి.

Make in India, Export Growth: భారత్ గ్లోబల్ తయారీ కేంద్రంగా మారాలంటే పోర్టులు, రోడ్లు, రైల్వేలు, గోదాములు అన్నీ సమన్వయంతో పనిచేయాలి. అప్పుడే అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెడతాయి.బడ్జెట్ 2026లో ప్రభుత్వ విధానాలు ఈ రంగానికి మద్దతిస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. ఉద్యోగాలు, పెట్టుబడులు, ఎగుమతులు అన్నీ కలిపి దేశాభివృద్ధికి దోహదపడతాయి.

భారతదేశం ఇప్పటికే ప్రపంచ లాజిస్టిక్స్ హబ్‌గా మారేందుకు బలమైన పునాదిని కలిగి ఉంది. బడ్జెట్ 2026 ఈ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయాలంటే కొన్ని సమస్యలపై దృష్టి పెట్టాలి. మౌలిక సదుపాయాలు, సాంకేతికత, స్థిరత్వం, మానవ మూలధనాన్ని ఒకే దృక్కోణంలో సమన్వయం చేస్తే. అప్పుడు లాజిస్టిక్స్ కేవలం వస్తువులను వేగంగా తరలించే వ్యవస్థగా కాకుండా, భారతదేశాన్ని బాధ్యతాయుతంగా, సమగ్రంగా ముందుకు నడిపించే శక్తిగా మారుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+