ప్రపంచం మొత్తం AI దిశలో వేగంగా సాగుతోంది. అయితే, దీని వల్ల ఉద్యోగాలపై ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే పెద్ద సందేహంగా ఉంది. కొంత మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు, మరోవైపు కంపెనీలు కొత్తగా AI ఆధారిత పనులను వేగంగా తీసుకొస్తున్నాయి. ఈ పరిస్థితిపై టెక్ రంగంలోని ప్రముఖులు వినోద్ ఖోస్లా, సుందర్ పిచై, సత్య నాదెళ్ల, జెన్సెన్ హువాంగ్, డారియో అమోడై, సామ్ ఆల్ట్‌మాన్, కెవిన్ వైల్ ఏమంటున్నారో చూద్దాం.

వినోద్ ఖోస్లా:
వినోద్ ఖోస్లా, ప్రముఖ భారతీయ అమెరికన్ వెంచర్ కాపిటలిస్ట్. ఆయన ప్రకారం, AI వల్ల ఇండియాలో BPO రంగం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. Zerodha సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ హోస్ట్ చేసిన పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ "BPO రంగం పూర్తిగా మాయమవుతుంది. సాఫ్ట్‌వేర్ IT సేవలు కూడా మునుపటి లాగా ఉండవు. ఇవన్నీ మారాలి. మారితేనే బ్రతికే అవకాశం." అలాగే, 1960ల కాలంలో వచ్చిన టెక్నాలజీ మార్పుల కంటే ఇప్పుడు AI మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
ఆయన అంచనా ప్రకారం "వచ్చే ఐదు సంవత్సరాల్లో మానవులు చేసే ఉద్యోగాల్లో 80% ను AI చేయగలదు. 2040 నాటికి మనుషులు డబ్బు కోసం కాదు, తాము ఇష్టపడే పనుల కోసం మాత్రమే పని చేస్తారు."
సుందర్ పిచై:
గూగుల్ CEO సుందర్ పిచై మాత్రం ఈ విషయాన్ని కొంచెం బిన్నంగా చెప్తున్నారు. ప్రస్తుతం "గూగుల్ లో రాసే కోడ్ లో సుమారు 30% కు AI సహాయం ఉంటుంది. అయినా, మేము ఇంకా కొత్త ఇంజనీర్ల దగ్గర నుంచి తీసుకుంటున్నాం."AI సహాయంతో మామూలు పనులు తగ్గిపోయాయి. అందుకే ఇంజనీర్లు క్రియేటివ్ పనులు చేయడానికి ఎక్కువ సమయం దొరుకుతోంది. దీనివల్ల పని చేసే వేగం కూడా 10% పెరిగిందట.
సత్య నాదెళ్ల:
మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల దృష్టిలో, AI మన పని విధానాన్ని మార్చుతుంది. ఉద్యోగం అంటే ఏ పని, ఎలా చేయాలి అనే నిర్వచనమే మారిపోతుందంటున్నారు. లింక్డ్ఇన్‌లో ఇప్పుడు ఒకే వ్యక్తి డిజైన్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ పనులు చేస్తున్నాడు. దీనిని 'ఫుల్ స్టాక్ బిల్డర్' అంటారు. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ మధ్యస్థ ఉద్యోగులను తగ్గిస్తూ 6,000 మందిని తొలగించింది.
జెన్సెన్ హువాంగ్ (NVIDIA CEO):
NVIDIA కంపెనీ CEO జెన్సన్ హువాంగ్ మాట్లాడుతూ "AI వల్ల కొన్ని ఉద్యోగాలు పోతాయి. కానీ చాలా కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇది ఇలా జరుగుతూ ఉండె ప్రక్రియ."ఉదాహరణకు, డేటా సైన్స్, AI మోడల్ ట్రెయినింగ్, హైఎండ్ ఇంజినీరింగ్ వంటి రంగాల్లో కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
డారియో అమోడై (Anthropic CEO):
Anthropic సంస్థ CEO డారియో అమోడై అభిప్రాయం ప్రకారం "మొత్తం కోడింగ్ పనులలో 90% AI చేయగల సామర్థ్యం 3-6 నెలల్లో వస్తుంది." దీని అర్థం, ప్రోగ్రామర్లు ఇక ముందు actual కోడింగ్ కాకుండా, AI ని సూపర్వైజ చేయాల్సి ఉంటుంది.
కెవిన్ వైల్ (OpenAI CPO):
కెవిన్ వైల్, OpenAI ప్రధాన ప్రోడక్ట్ ఆఫీసర్, ఓ పోడ్‌కాస్ట్‌లో "2027కి ముందే ఎక్కువ కోడింగ్ పనులు AI చేయగలదు. కానీ మనుషులు మాయం కారు. వారు AI ని అసిస్టెంట్ లా ఉపయోగిస్తారు." భవిష్యత్తులో ఉద్యోగులు AI మేనేజర్లు లాగా పని చేయాల్సి వస్తుందన్నది ఆయన అభిప్రాయం.
సామ్ ఆల్ట్‌మాన్ (OpenAI CEO):
OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ కూడా ఈ అభిప్రాయంతోనే ఉన్నారు. పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ "ఇప్పటికే చాలా కంపెనీల్లో 50% పైగా కోడ్ AI రాస్తోంది అని చెప్పారు.
ఈ మాటలన్నింటినీ చూస్తే ఒక విషయం బాగా అర్థమవుతోంది. AI వల్ల ఉద్యోగాలపై ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కానీ అంతటితో ఉద్యోగాలు పోతాయన్నమాట కాదు. పనులు చేసే విధానం మారుతుంది. మనం కూడా మన పనితీరును మార్చుకుంటే, AI తో కలిసి పని చేయగలిగితే, భవిష్యత్తులో అవకాశాలు తగ్గవు, కానీ కొత్త అవకాశాలు కూడా రావచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications