Insurance News: గేమ్ ఛేంజర్‌గా IRDAI ఇన్సూరెన్స్ పాలసీ.. కేవలం 1,500తో ఎన్నో బెనిఫిట్స్
Bima Vistaar: ప్రస్తుత జీవన విధానం ప్రకారం దాదాపు ప్రతి ఒక్కరూ బీమా తప్పనిసరిగా కలిగి ఉంటున్నారు. వైద్య ఖర్చుల కోసం ఆరోగ్య బీమా, కుటుంబం కోసం జీవిత బీమా, ప్రమాద బీమా, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి విభిన్న రకాల బీమా పథకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వేర్వేరుగా ఒక్కోదానిని కొనుగోలు చేయడం తలకు మించిన భారంగా తయారైంది. దీంతో ప్రభుత్వం ఓ కొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది.
ఒక్కో వ్యక్తి నాలుగైదు రకాల ఇన్సూరెన్సులు తీసుకోవడానికి భారీ రేంజ్‌లో ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. ఇందువల్ల పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) చర్యలు చేపట్టింది. జీవిత, ఆరోగ్య, ఆస్తి, ప్రమాద బీమా వంటి అన్నిరకాల పాలసీలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

'బీమా విస్తార్' పేరిట ఓ ప్రామాణిక పాలసీని అందుబాటులోకి తేవాలని IRDAI చూస్తోంది. దీని కోసం వెచ్చించే ఖర్చు కూడా నామమాత్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. తద్వారా సామాన్యులకు సైతం విరివిగా బీమా సేవలు అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఈ మేరకు తాజాగా హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగిన 'బీమా మంథన్'లో విస్తృత చర్చలు సైతం జరిపినట్లు సమాచారం.
వ్యక్తిగత జీవిత బీమా కోసం 820, ఆరోగ్య బీమాకు 500, ప్రమాద బీమాకు 100, ఆస్తి బీమా కోసం 80 చొప్పున ప్రీమియం ఉండవచ్చని బీమా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెరసి మొత్తం పాలసీ ప్రీమియం ఏడాదికి 1,500గా ఉంటుందని భావిస్తున్నారు. అయితే కుటుంబం మొత్తం కవర్ కావాలంటే 2 వేల 420 చెల్లించాల్సి రావచ్చని చెబుతున్నారు. పాలసీ వివరాలతో పాటు నిబంధనలను IRDAI అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications