కరోనా వైరస్ చికిత్సకు ఇన్సురెన్స్, బీమా కంపెనీలకు ఆదేశాలు
కరోనా వైరస్ (కోవిడ్ 19)ను కూడా బీమా కిందకు తీసుకు రావాలని ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఇన్సురెన్స్ కంపెనీలను ఆదేశించింది. కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైంది. కరోనా వైరస్ చికిత్సకు అయ్యే ఖర్చులు కవర్ అయ్యేలా పాలసీలను ఆవిష్కరించాలని బీమా కంపెనీలకు తెలిపింది.
కరోనా వైరస్ ప్రభావం.. మరిన్ని బిజినెస్ న్యూస్

కరోనా వైరస్ చికిత్సపై క్లెయిమ్
వేర్వేరు వ్యాధులకు ప్రత్యేకించిన పాలసీలను బీమా కంపెనీలు అమలు చేస్తుంటాయి. ఇదే విధంగా కరోనా వైరస్ చికిత్సకు అయ్యే ఖర్చులను కూడా బీమా కవర్ అయ్యేలా పాలసీలు ఆవిష్కరించాలని సర్క్యులర్ జారీ చేసింది. ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందినప్పుడు బీమా కవర్అయితే కరోనా వైరస్ చికిత్స కోసం క్లెయిమ్‌ను సాధ్యమైనంత వేగంగా పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించింది.

ఆ తర్వాతే తిరస్కరించవచ్చు
క్వారంటైన్ గదితో పాటు కరోనా వైరస్ చికిత్స మొత్తానికి అయిన వైద్య ఖర్చుల్లో ఆమోదయోగ్యం ఉన్న వాటిని అన్నింటిని పాలసీ షరతులకు, నిబంధనలకు లోబడి పరిష్కరించాలని ఆదేశించింది. రివ్యూ కమిటీ పూర్తిగా పరిశీలించాకే అర్హత లేని వాటిని తిరస్కరించవచ్చునని తెలిపింది.

కరోనా వైరస్
చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది వేగంగా వ్యాప్తిస్తోంది. కరోనా కారణంగా 3 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. దాదాపు లక్షమందికి సోకింది. మన దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు అందించే చికిత్సకు తగిన విధంగా బీమా పాలసీని తీసుకు రావాలని, రోగులకు సత్వర వైద్యం అందేలా క్లెయిమ్స్ త్వరగా పూర్తి కావాలని ఆదేశించింది.


Click it and Unblock the Notifications