రైల్వే ప్రయాణికులకు అలర్ట్. IRCTC తత్కాల్ టికెట్ బుకింగ్ కు సంబంధించిన కొత్త నియమాలు అందుబాటులోకి వచ్చాయి. జూలై 1, 2025 నుండి అందుబాటులోకి తీసుకువచ్చిన కొత్త నియమాలు అమలులోకి వస్తాయని ఇండియన్ రైల్వే తెలిపింది. ఈ నియమాల ప్రకారం.. ఇకపై ప్రయాణికులు IRCTC అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఆధార్ కలిగి ఉన్న వారు మాత్రమే తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం.. తత్కాల్ ఆన్‌లైన్ రిజర్వేషన్‌లకు ఆధార్ ఓటీపీ తప్పనిసరి. జూలై 15, 2025 నుండి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆధార్ ఆదారిత KYC కలిగి ఉన్న వినియోగదారులు మాత్రమే బుకింగ్స్ ఓపెనింగ్ చేసిన తర్వాత మొదటి 30 నిమిషాలలో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఈ నిబంధనలతో ప్రయాణీకులకు టిక్కెట్లు ఎక్కవుగా అందుబాటులో ఉంటాయని కేంద్ర రైల్వే మంత్రి తెలిపారు. ఇకపై ఏజెంట్లు AC, నాన్-AC కోచ్‌లలో టికెట్ బుకింగ్ వదిలిన మొదటి 30 నిమిషాలలో తత్కాల్ టికెట్లు బుక్ చేయడం సాధ్యం కాదు. వచ్చే నెల నుండి తత్కాల్ బుకింగ్ కోసం ఆధార్ తప్పనిసరి చేశారు.

మీ IRCTC ఖాతాలో ఆధార్ నంబర్ ను ఎలా ధృవీకరించాలి.
ముందుగా మీరు అధికారిక IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌ను సందర్శించి, మీ ఖాతాకు లాగిన్ అవ్వండి.
అక్కడ కనిపించే 'MY Account'కి వెళ్లి ' మీ వివరాలను' ఎంచుకోండి.
తరువాత మీ ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడిని ఎంటర్ చేయండి
అక్కడ తర్వాత కనిపించే Verify Details మీద క్లిక్ చేయండి
వివరాలు ఎంటర్ చేయగానే మీ ఆధార్-లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది.
ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి
అన్ని వివరాలను సరిచూసుకున్న తరువాత అక్కడ submitted బటన్ పై క్లిక్ చేయండి
మీ వివరాల సరిపోకపోతే మీకు హెచ్చరిక సందేశం వస్తుంది.
అలాంటి సమయంలో మళ్లీ మీరు పై విధంగానే కరెక్ట్ వివరాలను ఎంటర్ చేయండి
IRCTC ఖాతాతో ఆధార్ నంబర్‌ను ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి
ముందుగా మీరు అధికారిక IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌ను సందర్శించి, మీ ఖాతాకు లాగిన్ అవ్వండి.
అక్కడ కనిపించే లింక్ ఆధార్ పై క్లిక్ చేయండి
ఆ తరువాత మీరు ఆధార్ ప్రకారం పేరును ఎంటర్ చేయండి
అనంతరం కనిపించే'Send OTP' పై క్లిక్ చేయండి
క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఈ OTPని నమోదు చేసి, Verify OTP బటన్‌ను క్లిక్ చేయండి.
ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీ KYC వివరాలు యాడ్ చేయబడతాయి.
అన్నీ అయిపోయాక మీరు ఆధార్ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి 'అప్‌డేట్' బటన్ నొక్కండి
తరువాత మీకు లింక్ అయిందంటూ ఓ సందేశం వస్తుంది.
మీరు ఎవరైనా ఆధార్ లింక్ చేయకపోతే వెంటనే చేయండి. IRCTC ఖాతాలోకి లాగిన్ అయి మీ కేవైసీ వివరాలను వెంటనే పొందుపరచండి. మీ మొబైల్ నంబరుతో తప్పనిసరిగా ఆధార్ లింక్ చేయడం మరచిపోకండి.


Click it and Unblock the Notifications