ఎప్పుడూ లేని విధంగా ఇండియన్ రైల్వేస్ ఒక భారీ చర్య చేపట్టింది. ఏకంగా మూడు కోట్ల IRCTC అకౌంట్లను బ్లాక్ చేసింది. నకిలీ (ఫ్రాడ్) యూజర్ ఐడీలను అరికట్టడంలో భాగంగా.. 2025 జనవరి నుంచి కేవలం 12 నెలల్లోనే ఏకంగా 3.02 కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో వెల్లడించారు.

భారతీయ రైల్వేస్ (Indian Railways) ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో (IRCTC) భారీ స్థాయిలో క్లీనప్ ఆపరేషన్ చేపట్టింది. భారీ సంఖ్యలో అకౌంట్లు బ్లాక్ అవ్వడానికి ప్రధాన కారణం "బాట్" (Automated Bots) ల బెడద. నకిలీ వ్యక్తులు, మోసగాళ్లు ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను ఉపయోగించి వేలాది నకిలీ ప్రొఫైల్‌లను తయారు చేస్తున్నారు. ఈ ఫేక్ అకౌంట్ల ద్వారా వారు తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభం కాగానే సెకన్ల వ్యవధిలో టికెట్లను బుక్ చేస్తున్నారు. అనంతరం ఈ టికెట్లను అసలైన ప్రయాణికులకు అధిక ధరలకు రీసేల్ చేస్తున్నారు. దీని కారణంగా, నిజంగా అత్యవసరంగా ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ఎంత ప్రయత్నించినా తత్కాల్ బుకింగ్ (Tatkal ticket booking) లో కన్ఫర్మ్ టికెట్ పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడానికే రైల్వేస్ ఈ కఠిన చర్యలు చేపట్టింది. ఈ చర్యల ద్వారా Tatkal ticket booking లో నిజమైన ప్రయాణికులకు టికెట్లు దొరికే అవకాశం బాగా పెరుగుతుంది.
నకిలీలను అరికట్టడానికి రైల్వేస్ ప్లాన్..
కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని కీలకమైన టెక్నాలజీ ఆధారిత చర్యలను అమలు చేస్తున్నాయి..
- యాంటీ-బాట్ సొల్యూషన్స్: నకిలీ యూజర్లను ఫిల్టర్ చేయడానికి, అసలైన ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా టికెట్ బుకింగ్ అనుభవాన్ని అందించడానికి 'AKAMAI' వంటి అధునాతన యాంటీ-బాట్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు.
- ఆధార్ ఆధారిత OTP వెరిఫికేషన్: Tatkal ticket booking దుర్వినియోగాన్ని అరికట్టడానికి, ఆన్‌లైన్ కౌంటర్లలో టికెట్ బుకింగ్‌కు దశలవారీగా ఆధార్-ఆధారిత వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) ధృవీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ OTP విధానం అమలు చేసిన 322 రైళ్లలో దాదాపు 65% రైళ్లలో కన్ఫర్మ్ తత్కాల్ టికెట్ల లభ్యత మెరుగుపడింది.
- సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదులు: అనుమానాస్పదంగా బుక్ చేసిన PNR లపై నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదులు దాఖలు చేస్తున్నారు.
- ప్రొటెక్షన్ లేయర్స్ (Multiple Protective Layers): నెట్‌వర్క్ ఫైర్‌వాల్స్, ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్స్ వంటి రక్షణ పొరలను ఉపయోగించి రైల్వే వ్యవస్థను సైబర్ బెదిరింపుల నుండి రక్షిస్తున్నారు.
- సాధారణ ఆడిట్‌లు: టికెట్ బుకింగ్ వ్యవస్థకు సంబంధించి భద్రతా ఆడిట్‌లను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.
మీ IRCTC అకౌంట్ యాక్టివ్‌గా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?
మీ IRCTC అకౌంట్ అనుమానాస్పద జాబితాలో చేరి డీయాక్టివేట్ అయితే.. మీరు లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు సాధారణంగా "Invalid User ID/Password" లేదా "Account Deactivated" లాంటి మెసేజ్ కనిపిస్తుంది. మీ అకౌంట్ యాక్టివ్‌గా ఉందో లేదో తెలుసుకోవడానికి మీరు ఇలా చేయొచ్చు..
- లాగిన్ అవ్వండి: మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించండి. లాగిన్ సక్సెస్ అయితే మీ అకౌంట్ యాక్టివ్‌గా ఉన్నట్లే.
- పాస్‌వర్డ్ రీసెట్: ఒకవేళ లాగిన్ అవ్వలేకపోతే, పాస్‌వర్డ్ రీసెట్ ఫీచర్‌ను ఉపయోగించండి. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్/మొబైల్‌కు రీసెట్ లింక్ వస్తే, అకౌంట్ యాక్టివ్‌గా ఉన్నా ఏదో సమస్య ఉన్నట్లు. పాస్‌వర్డ్ రీసెట్ కాకపోతే, మీ అకౌంట్ డీయాక్టివేట్ అయి ఉండవచ్చు.
- డీయాక్టివేట్ అయితే: అకౌంట్ డీయాక్టివేట్ అయినట్లు స్పష్టమైతే, IRCTC కస్టమర్ కేర్‌ను సంప్రదించి, సరైన ధృవీకరణ పత్రాలను సమర్పించి అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేయించుకోవచ్చు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications