అంచనాలకు మించి దుమ్ముదులిపిన IRCTC.. టికెట్ అమ్మకాలు ఫ్లాట్ గా ముగిసినా..
IRCTC: భారతీయ రైల్వేల్లో ప్రయాణీకులకు వివిధ రకాల సదుపాయాలను అందిస్తున్న సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). తాజాగా ఈ సంస్థ Q4 ఫలితాలు వెలవడ్డాయి. టిక్కెట్ విక్రయాలు ఫ్లాట్ గా ఉన్నప్పటికీ దాని లాభాలు మాత్రం మార్కెట్ అంచనాలను మించి పోవడం గమనార్హం.
క్యాటరింగ్, టూరిజం మరియు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విభాగాల నుంచి మంచి సహకారం లభించడం వల్ల నాల్గవ త్రైమాసికంలో IRCTC లాభం పెరిగింది. మార్చితో ముగిసిన ఈ త్రైమాసికంలో నికర లాభం 30 శాతం పెరిగి 278.8 కోట్లకు చేరుకున్నట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. బ్లూమ్ బెర్గ్ ట్రాక్ చేసిన విశ్లేషకులు మాత్రం 248 కోట్ల లాభాలు సాధించవచ్చని గతంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే ఆ అంచనాలను IRCTC బీట్ చేసింది.

ఈ త్రైమాసికంలో కంపెనీ దాదాపు 26 కోట్ల వన్-టైమ్ లాభాన్ని నమోదు చేసింది. 892 కోట్ల అంచనాలతో పోలిస్తే ఆదాయం 40 శాతం పెరిగి 965 కోట్లకు చేరుకుంది. EBITA 327 కోట్ల అంచనాతో 17 శాతం వృద్ధి చెంది 324.6 కోట్లకు పెరిగింది. EBITDA మార్జిన్ కూడా గత సంవత్సరం 33.6 శాతం కాగా.. ప్రస్తుతం 40.3 శాతంగా ఉంది. అయితే అంచనా కేవలం 36.6 శాతం మాత్రమే.
ఇంటర్నెట్ టికెటింగ్‌తో పోలిస్తే తక్కువ మార్జిన్ సెగ్మెంట్ అయిన క్యాటరింగ్ ఈసారి అధికంగా సహకారం అందించింది. అందువల్ల ఈ త్రైమాసికంలో మార్జిన్ తగ్గుదల కొనసాగింది. కరోనా వేళ నిలిపివేయబడిన ఫుడ్ సర్వింగ్ సేవ గత సంవత్సరం తిరిగి ప్రారంభించబడింది. అగ్రశ్రేణికి క్యాటరింగ్ విభాగం సహకారం గత ఏడాది ఇదే కాలంలో 38.5 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది.


Click it and Unblock the Notifications