IRCTC Stock: లాభాలతో దుమ్ము రేపిన IRCTC.. స్టాక్ రేటు పెరిగే అవకాశం.. వాటి నుంచే భారీగా ఆదాయం..

IRCTC Stock: జూన్ 30, 2022తో ముగిసిన త్రైమాసికానికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. బుధవారం విడుదల చేసిన వివరాల ప్రకారం కంపెనీ అద్భుతమైన లాభాలను ఆర్జించింది. రైల్వే కంపెనీ నికర లాభం జూన్ త్రైమాసికంలో 198% పెరిగి రూ. 245.52 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో IRCTC నికర లాభం కేవలం రూ.82.52 కోట్లుగా ఉంది.

ఈ కాలంలో కార్యకలాపాల ద్వారా IRCTC ఆదాయం 250.34 % పెరిగి రూ.852.59 కోట్లకు చేరుకుంది. ఇది Q1FY22లో రూ.243.36 కోట్లుగా ఉంది. FY22 మొదటి త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.258 కోట్లతో పోలిస్తే జూన్ త్రైమాసికంలో రూ.877 కోట్లకు పెరిగింది. ఏడాది ప్రాతిపదికన సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.147 కోట్ల నుంచి రూ.548 కోట్లకు పెరిగింది. EBITDA- Q1-FY23లో రూ.320.9 కోట్లు ఉండగా.. గత ఏడాది ఇదే కాలానికి అది రూ. 111.5 కోట్లుగా ఉంది.

IRCTC posted quartely results with good numbers knoe details

సెగ్మెంట్ వారీగా చూస్తే IRCTCకి చెందిన ఐదు వ్యాపారాలు వృద్ధిని నమోదు చేశాయి. క్యాటరింగ్ సేవల నుంచి ఆదాయం రూ.56.7 కోట్ల నుంచి రూ.352 కోట్లకు పెరిగింది. అదే సమయంలో IRCTC ఇంటర్నెట్ టికెటింగ్ వ్యాపారం ద్వారా రూ.301.6 కోట్లు, రైల్ నీర్ వ్యాపారం నుంచి రూ. 83.6 కోట్లు, పర్యాటక విభాగం నుంచి రూ. 81.9 కోట్లు, టూరిజం వ్యాపారం నుంచి రూ.33.2 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కరోనా తరువాత 27.11.2021 నుంచి దశలవారీగా వండి ఆహారం కేటరింగ్ సేవలు పునరుద్ధరించబడినందున మంచి లాభాలను ఆర్జించినట్లు కంపెనీ వెల్లడించింది.

అద్భుతమైన త్రైమాసిక ఫలితాలను దృష్టిలోకి తీసుకుని ప్రభుదాస్ లిల్లాధర్ ప్రైవేట్ లిమిటెడ్ రీసెర్చ్ అనలిస్ట్ జినేష్ జోషి స్టాక్‌కు హోల్డ్ రేటింగ్ ఇచ్చారు. ప్రస్తుతం రూ. 649 టార్గెట్ ధరతో స్టాక్‌పై హోల్డ్ రేటింగ్‌ ఇచ్చారు. మహమ్మారి తరువాత కోలుకుంటున్న పర్యాటక రంగం మంచి మార్జిన్లను అందించిందని అన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+