న్యూఢిల్లీ: మీరు ట్రైయిన్‌లో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేయడం కష్టమవుతోందా? అలానే మీరు ఇప్పటికే బుక్ చేసిన టికెట్ క్యాన్సిల్ చేస్తే ఆ రీఫండ్ డబ్బులు వచ్చేందుకు చాలా సమయం తీసుకుంటోందా.. అదంతా ఒకప్పుడు. ఇప్పటి నుంచి వీటన్నిటికీ చెక్ పెట్టింది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). ఇప్పటి వరకు టికెట్ బుక్ చేయాలంటే ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసుకుని పేమెంట్ కోసం థర్డ్ పార్టీ పై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు.
ఐఆర్‌సీటీసీ ద్వారా ఇప్పటి వరకు యాప్ పై లేదా వెబ్‌సైట్ పై టికెట్లు బుక్ చేసుకోవడం కానీ, బుక్ చేసుకున్న టికెట్లను కానీ రద్దు చేసుకునే వాళ్లం. అయితే ఈ ప్రక్రియ కాస్త కష్టతరంగా ఉండేది. ఈ సమస్యలకు చెక్ పెడుతూ ముందుగా ఐఆర్‌సీటీసీ తన వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసింది. ఇప్పుడు తాజాగా పేమెంట్ గేట్‌వేను కూడా సొంతంగా ప్రారంభించింది. ఇప్పటి వరకు పేమెంట్ గేట్‌వే థర్డ్ పార్టీ ద్వారా జరిగేది. దానికి స్వస్తి పలుకుతూ సొంత పేమెంట్ గేట్‌వేను ప్రారంభించింది ఐఆర్‌సీటీసీ. వినియోగదారులకు మరింత చేరువైంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది.

కొత్త వెసులు బాటు అందుబాటులోకి రాకముందు, ఒక ప్రయాణికుడు టికెట్ బుక్ చేయాలనుకున్నప్పుడు చాలా సమయం వేచి చూడాల్సి వచ్చేది. ముందుగా ప్యాసింజర్ వివరాలు నమోదు చేసి ఆపై డబ్బులు చెల్లించే సమయంలో చాలా సేపు వేచి చూడాల్సి వచ్చేది. వారు ఏ బ్యాంకు నుంచి అయితే చెల్లింపులు చేయాలనుకునేవారో... ఆ బ్యాంకు నుంచి అనుమతి వచ్చేవరకు పేమెంట్ గేట్‌వేపై వేచిచూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పెడుతూ సొంత పేమెంట్ గేట్‌వేను ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. IRCTC-iPay ద్వారా ప్రయాణికులు టికెట్ రద్దు చేసిన వెంటనే డబ్బులు రీఫండ్ అవుతాయి.

భారత్ స్వావలంబన దిశగా పయనిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు రైల్వేశాఖకు అనుబంధంగా ఉన్న ఐఆర్‌సీటీసీని అప్‌గ్రేడ్ చేసింది. ఇక IRCTC-iPay ద్వారా లావాదేవీలు జరిపేందుకు ముందుగా ప్రయాణికులు డెబిట్ కార్డు లేదా యూపీఐ బ్యాంకు అకౌంట్ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక భవిష్యత్తులో కొనుగోలు చేసే టికెట్లన్నిటికీ ఈ డెబిట్ కార్డు లేదా యూపీఐ బ్యాంకు వివరాల ద్వారా సింగిల్ క్లిక్‌తో చేసుకోవచ్చు. దీనివల్ల టికెట్ బుకింగ్ సమయం త్వరగా పూర్తవడమే కాకుండా బోలెడంత సమయం ఆదా అవుతుంది. మొత్తానికి ఈ అప్‌గ్రేడ్ అయిన వెర్షన్‌తో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకటిలా ఎక్కువ సేపు వేచిచూసి టికెట్ బుక్ అవుతుందో లేదో అన్న టెన్షన్ నుంచి కాస్త విముక్తి లభించినట్లయ్యిందని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications