IRCTC News: రైలులో ప్రయాణిస్తున్న ప్రజలకు భారతీయ రైల్వే మరోసారి పెద్ద దెబ్బ తగిలింది. రైళ్లలో ప్రయాణికులకు విక్రయించే ఆహార పదార్థాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ధరల పెంపు వెనుక నాణ్యతను మెరుగుపరటమే కారణంగా ఉన్నట్లు రైల్వే శాఖ చెబుతోంది. ఇందులో భాగంగా దాదాపు 70 వంటకాల ధరల్లో మార్పులు చేసింది.

ద్రవ్యోల్బణం ఎఫెక్ట్..
దేశంలో ప్రజలు ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భారతీయ రైల్వేలు కూడా తమ ధరల పెంపుకు దీనినే కారణంగా చెబుతోంది. ప్రయాణంలో రైలులోని ప్యాంట్రీమెన్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. రైలులో లభించే వివిధ వస్తువులపై రూ.2 నుంచి రూ.25 వరకు ప్రస్తుతం ధరలను పెంచుతున్నట్లు రైల్వే వెల్లడించింది. ప్రస్తుతం ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి వెళ్లే రైళ్లకు మాత్రమే ఈ ధరల పెంపు అమలు కానుందని తెలుస్తోంది.

రీజినల్ మేనేజర్..
ఆహారంలో నాణ్యత, పరిమాణం రెండూ మెరుగయ్యాయని ఐఆర్‌సీటీసీ రీజినల్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ తెలిపారు. అందువల్లే ఆహార పదార్థాల ధరలను పెంచినట్లు వెల్లడించారు. తాజా ధరల పెంపు రోటీ, దోసె, పప్పు, గులాబ్ జామూన్, శాండ్ విచ్, సమోసా వంటి అనేక ఆహారాల ధరలు మునుపటి కంటే పెరిగాయని స్పష్టం చేశారు.

పెరిగిన ధరల పట్టిక..
ధరలను గమనిస్తే బ్రెడ్ రూ.3 నుంచి రూ.10కి చేరుకోగా, మసాలా దోశ రూ.40 నుంచి రూ.50కి, శాండ్విచ్ ధర రూ.15 నుంచి రూ.25కి, బర్గర్ ధర రూ.40 నుంచి రూ.50కి, ధోక్లా(100 గ్రాములు) ధర రూ.20 నుంచి రూ.30కి, సమోసా ధర రూ.8 నుంచి రూ.10కి, బ్రెడ్ డంబ్లింగ్స్ ధర రూ.10 నుంచి రూ.15కి, వడ రేటు రూ.7 నుంచి రూ.10కి పెంచటం జరిగింది. దీనికి తోడు ఇతర అనేక ఆహార పదార్థాల ధరలను సైతం IRCTC తాజాగా సవరించింది.


Click it and Unblock the Notifications