Adani News: అదానీ రైలు టిక్కెట్ల వ్యాపారంపై కాంగ్రెస్ రగడ.. IRCTC ఏమందంటే..?
Trainman: దేశంలో బాగా పాపులర్ అయిన ట్రైన్ టిక్కెట్లు బుక్కింగ్ ప్లాట్ ఫారమ్ ట్రైన్‌మ్యాన్ ను గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్ కొనుగోలు చేస్తోంది. దీంతో ఇకపై అదానీ గ్రూప్ రైల్వే టిక్కెట్ల అమ్మకాలను చేపట్టనుంది.
స్టార్క్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు అదానీ ఎంటర్ ప్రైజెస్ ఇప్పటికే డీల్ కుదుర్చుకుంది. దీనిపై ఐసీఐసీఐ డైరెక్ట్ ఒక ట్వీట్ చేసింది. అదానీ ఐఆర్సీటీసీతో పోటీ పడటం లేదని, ఇది గుత్తాధిపత్యానికి దారితీసే అవకాశం లేదని వెల్లడించింది. ట్రైన్‌మ్యాన్ తరహాలో మెుత్తం 32 సంస్థలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వెల్లడించింది.

అదానీ గ్రూప్ ట్రైన్‌మ్యాన్ వ్యాపారాన్ని కొనుగోలు చేయటంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ చేసిన ట్వీటుకు బదులిచ్చింది. ఈ డీల్ వద్ద IRCTCకి ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది. ఐఆర్సీటీసీకి ఉన్న మెుత్తం 32 బిజినెస్-టు-కస్టమర్ భాగస్వాముల్లో ఇది ఒకటి మాత్రమేనని తెలిపింది. ముందు IRCTCతో మొదటి పోటీ అంటూ గౌతమ్ అదానీ రంగంలోకి దిగుతారని.. ఆ తర్వాత దానిని స్వాధీనం చేసుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ డీల్ ప్రకటన గురించి కామెంట్ చేయటంతో ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వేలు కౌంటర్ ఇచ్చింది.
ట్రైన్‌మ్యాన్‌ను IIT-రూర్కీ గ్రాడ్యుయేట్లు వినీత్ చిరానియా, కరణ్ కుమార్ రూపొందించారు. రైలు టిక్కెట్ల బుక్కింగ్, పీఎన్ఆర్ స్టేటస్ వంటి సమాచారాన్ని వినియోగదారులు దీని ద్వారా చేసుకోవటం కోసం స్టార్టప్ స్థాపించబడింది. కంపెనీ ప్రస్తుతం గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇటీవల గుడ్‌వాటర్ క్యాపిటల్, హేమ్ ఏంజెల్స్ సహా ఇతరులతో అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 1 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ అనుబంధ సంస్థ అయిన ఆదానీ డిజిటల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజా డీల్ కుదుర్చుకుంది. అయితే డీల్ పూర్తి విలువ ఎంతనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications