GST On Toilet: మీరు రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్‌లోని టాయిలెట్‌ని ప్రయాణ సమయంలో లేదా మరొక సమయంలో ఉపయోగించి ఉంటారు. ఈ సర్వీస్ వినియోగించుకున్నందుకు మహా అయితే మీరు రూ.5 లేదా మహా అయితే రూ.10 రుసుముగా చెల్లించి ఉంటారు. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే వార్త వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అవును ఐఆర్సీటీసీ నిర్వాకం గురించి ఇప్పుడు తెలుసుకోండి.

టాయిలెట్ పై జీఎస్టీ..
టాయిలెట్‌కు వెళ్తే భారీగా GST వసూలు చేసిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ ఘటన ఆగ్రా కాంట్ స్టేషన్‌లో ఈ వ్యవహారం జరిగింది. అక్కడి స్టేషన్ లోని ఎగ్జిక్యూటివ్ లాంజ్ వాష్‌రూమ్‌ను కొన్ని నిమిషాల పాటు ఉపయోగించుకున్నందుకు బ్రిటిష్ ఎంబసీ న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరు పర్యాటకు ఒక్కొక్కరికి రూ.112 అంటే రూ.224 చెల్లించాల్సి వచ్చింది.

భారీగా జీఎస్టీ వసూలు..
చెల్లించిన యూజర్ ఛార్జీల మొత్తంలో 6 శాతం SGST, 6 శాతం CGST ఉన్నాయి. టాయిలెట్‌కు వెళ్లేందుకు 12 శాతం జీఎస్టీ విధించారు. టాయిలెట్‌కి వెళ్లడం కూడా ఇంత ఖరీదని రుజువు కావడంలో ఇప్పటివరకు ఇలాంటి కేసు ఇదే తొలిసారి.

IRCTC ఏమని చెప్పింది?
పర్యాటకులు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌ను ఉపయోగించడం చాలా ఖరీదైనదని భావించారు. విషయం లాంజ్ మేనేజర్‌కు చేరినప్పుడు.. ఈ విషయంలో IRCTC తప్పు లేదని ఆయన చెప్పారు. ఎందుకంటే.. ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో ఉండటానికి 50 శాతం తగ్గింపు తర్వాత కనీస రుసుము రూ.112 చెల్లించడం తప్పనిసరని మేనేజర్ వెల్లడించారు. వాష్‌రూమ్స్ ఉపయోగించినందుకు ప్రత్యేకంగా జీఎస్‌టీ ఉండదని.. వైరల్ అవుతున్న వార్తపై వివరణ ఇచ్చింది. మీడియాలో వస్తున్న వార్తలు తప్పుదారి పట్టిస్తున్నాయని IRCTC వివరణ ఇచ్చింది.

రూ.112కి ఏ సేవలు అందుతాయి..
IRCTC ప్రకారం.. చెల్లింపు చేసిన తర్వాత ప్రయాణికులు కాంప్లిమెంటరీ కాఫీ గ్రౌండ్‌లో ఇవ్వబడుతుంది. ఇందులో వారు వాష్‌రూమ్‌ని ఉపయోగించవచ్చు. ఉచిత వైఫైని ఉపయోగించవచ్చు. 2 గంటల వరకు ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో ఉండగలరని తెలిపింది. ఈ సమయంలో టీవీతో పాటు ఉచిత మంచినీరు, టీ లాంటివి పొందుతారని రైల్వే వివరించింది.

గతంలో టీ బిల్లు వివాదం..
IRCTC తన సర్వీస్ ఛార్జ్ కారణంగా మొదటిసారి వార్తల్లోకి రాలేదు. గతంలో భోపాల్ శతాబ్ది రైలులో రూ.20 కప్పుపై ఒక వ్యక్తి నుంచి రూ.50 సర్వీస్ ఛార్జీని తీసుకునేవారు. ఆ వ్యక్తి ఒక కప్పు టీకి 70 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. రైల్వే ఈ 'హై-ఫై' సేవకు రుజువుగా, వ్యక్తి ఆ టీ బిల్లును సోషల్ మీడియాలో పంచుకున్నారు. అప్పట్లో రైల్వేలపై అనేక మంది సోషల్ మీడియా వేదికగా స్పందించారు.స
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications