IRCTC: రైలు ప్రయాణికులకు శుభవార్త.. డబ్బులు లేకున్నా టికెట్ తీసుకోవచ్చు..!
ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. IRCTC బై నౌ పే లేటర్ ఎంపికను తీసుకొచ్చింది. ఇందుకోసం ఐఆర్సీటీసీ క్యాష్ పే, ఈపేలేటర్, పేటీఎంలతో ఒప్పందం చేసుకుంది. ఈ సదుపాయంతో ప్రయాణికులు డబ్బులు లేకున్నా రైలు టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు.
టికెట్ డబ్బులను మూడు, ఆరు నెలల మధ్య ఉండే సరసమైన EMIలతో చెల్లించవచ్చు. Paytm వినియోగదారులు IRCTC టికెటింగ్ సేవల్లో 'ఇప్పుడే బుక్ చేయండి, తర్వాత చెల్లించండి' ఆప్షన్ కూడా ఉందని IRCTC తెలిపింది. Paytm పోస్ట్‌పెయిడ్‌ని దాని ప్లాట్‌ఫారమ్‌లో చేర్చిందని పేర్కొంది. ఇప్పుడు, Paytm పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు తమ టిక్కెట్లను IRCTC పోర్టల్ ద్వారా బుకింగ్ మొత్తాన్ని తర్వాత చెల్లించే ఎంపికతో బుక్ చేసుకోవచ్చు.

ఇటీవలి కాలంలో, Paytm ప్రవేశపెట్టిన బై నౌ పే లేటర్ కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుంది. Paytm పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు 30 రోజుల వ్యవధికి రూ. 60,000 వరకు వడ్డీ రహిత రుణాన్ని అందిస్తోంది. రైలు ప్రయాణికులు దీంతో రైలు టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు.

Paytm పోస్ట్‌పెయిడ్ ఎలా ఉపయోగించాలంటే
ముందుగా, మీరు IRCTC అధికారిక పోర్టల్‌ని సందర్శించాలి లేదా మీ మొబైల్‌లో IRCTC యాప్‌కి లాగిన్ అవ్వాలి. అప్పుడు, మీరు గమ్యం, తేదీ మొదలైన ప్రయాణ వివరాలను ఎంచుకుని, టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి కొనసాగించాలి. చెల్లింపు విభాగానికి వెళ్లి, 'బై నౌ పే లేటర్'పై క్లిక్ చేయాలి. Paytm పోస్ట్‌పెయిడ్‌ని ఎంచుకుని, మీ Paytm ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత, OTPని నమోదు చేసి టెకిట్ బుక్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications