Microsoft: ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న అమెరికాకు ఇరాన్ కష్టాలు పెరుగుతున్నాయి. వాస్తవానికి ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న పోరులో అమెరికా ఇజ్రాయెల్ పక్షాన నిలబడిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికాను దెబ్బతీయాలని ఇరానియన్ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన చేసింది.
మైక్రోసాఫ్ట్ తాజా బ్లాగ్ పోస్ట్ ప్రకారం ఎన్నికల రోజు సమీపిస్తున్న తరుణంలో ఇరాన్ హ్యాకింగ్ గ్రూప్ ప్రస్తుతం యూఎస్ ఎన్నికల వెబ్‌సైట్‌లు, మీడియా అవుట్‌లెట్‌లను భారీగా టార్గెట్ చేస్తున్నారని వెల్లడైంది. ఇదే క్రమంలో మరింత ప్రత్యక్ష ప్రభావ కార్యకలాపాల కోసం సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికల సంబంధిత వెబ్‌సైట్‌ల పరిశోధన ఏప్రిల్‌లో తిరిగి జరగగా, మైక్రోసాఫ్ట్ విశ్లేషకులు ఇటీవలే కార్యాచరణను బయటపెట్టారు. టెక్ దిగ్గజం ప్రకారం హ్యాకర్లు మే నెలలో ప్రధాన యూఎస్ మీడియా సంస్థలపై నిఘా నిర్వహించారు. ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి గ్రూప్ గతంలో చేసిన ప్రయత్నాలను బట్టి ఇది ఆందోళన కలిగిస్తుందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.

అయితే టెక్ దిగ్గజం లేవనెత్తిన ఆందోళనలు ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ మిషన్ ప్రతినిధి ఆరోపణలను తోసిపుచ్చారు. ఇటువంటి ఆరోపణలు ప్రాథమికంగా నిరాధారమైనని, పూర్తిగా ఆమోదయోగ్యం కానివిగా పేర్కొన్నారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశ్యం ఇరాన్‌కు లేదని అన్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకునే సమయంలో ఇరాన్, రష్యా, చైనాల నుంచి హ్యాకింగ్ గ్రూపులు అమెరికా ఎన్నికలను నియంత్రించడానికి లేదా పర్యవేక్షించడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఈ సంఘటన తాజా సూచనగా చెప్పుకోవచ్చు.
కాటన్ శాండ్‌స్టార్మ్ అధ్యక్ష ఎన్నికలకు ముందు మరో సైబర్ ఆపరేషన్‌ను నిర్వహించింది. "ప్రౌడ్ బాయ్స్" అనే తీవ్రవాద సమూహంలో సభ్యులుగా నటిస్తూ హ్యాకర్లు ఫ్లోరిడా ఓటర్లకు మెయిల్స్ పంపారు. ట్రంపుకు ఎన్నికల్లో ఓటు వేస్తే టార్గెట్ చేస్తామని బెదిరించిన సంగతి 2020లో జరిగింది. అయితే ఈ హ్యాకర్లు వాస్తవానికి ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో గందరగోళం, భయాందోళనలు, సందేహాలను సృష్టించటానికి ప్రాథమికంగా టార్గెట్ చేయబడ్డాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications