ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఇరాన్ వార్ (Iran War) పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య ముదురుతున్న పోరు ఇంధన మార్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే తాజాగా ఇరాక్ దేశానికి ఇరాన్ ఒక కీలక మినహాయింపునిచ్చినట్లు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ఇరాక్ చమురు రవాణాపై ఉన్న పరిమితులను ఇరాన్ తొలగించిందనే నివేదికల నేపథ్యంలో ఇరాక్ తన ఖాతాదారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

24 గంటల్లోగా ప్లాన్ ఇవ్వాలి: సోమో (SOMO)
ఇరాక్ ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థ 'సోమో', తన కస్టమర్లందరూ రాబోయే 24 గంటల్లోగా ఆయిల్ లోడింగ్ ప్లాన్లను సమర్పించాలని కోరింది. చమురు ఎగుమతుల కొనసాగింపు , స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమో స్పష్టం చేసింది. బాస్రా ఆయిల్ టెర్మినల్ సహా అన్ని లోడింగ్ పాయింట్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, ఎటువంటి ఆంక్షలు లేకుండా కాంట్రాక్టు ప్రకారం చమురు సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
పడిపోయిన ఉత్పత్తి.. పుంజుకునే అవకాశం!
అమెరికా-ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరాక్ చమురు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం రోజుకు కేవలం 8 లక్షల బారెళ్ల ఉత్పత్తికి పడిపోయిన పరిస్థితి నుంచి మళ్లీ గట్టెక్కాలని ఇరాక్ భావిస్తోంది. హోర్ముజ్ జలసంధి గుండా రవాణాకు అనుమతి లభించడం వల్ల ఇరాక్ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
ట్రంప్ డెడ్ లైన్.. యుద్ధ నేరాలపై చర్చ
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లు, వంతెనలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికలను డెమొక్రాటిక్ నాయకులు ఖండించారు. ఇవి యుద్ధ నేరాల కిందికి వస్తాయని మండిపడ్డారు. ఇరాన్ కూడా ట్రంప్ డెడ్ లైన్‌ను తోసిపుచ్చడమే కాకుండా అమెరికా దాడులు ఉధృతం చేస్తే హోర్ముజ్ జలసంధి అవతల ఉన్న అంతర్జాతీయ ఇంధన మార్గాలను కూడా ప్రమాదంలో పడేస్తామని హెచ్చరించింది.
ఇరు దేశాల్లో ప్రాణనష్టం.. శాంతి చర్చల ప్రయత్నాలు
ఇరాన్‌లోని బహరెస్తాన్, టెహ్రాన్, కోమ్ ప్రాంతాల్లో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆరుగురు పిల్లలతో సహా సుమారు 22 మంది మరణించినట్లు సమాచారం. దీనికి ప్రతీకారంగా ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంలో ఒక భవనం కుప్పకూలి ఇద్దరు మరణించారు. అబుదాబి, కువైట్ వంటి ప్రాంతాల్లో కూడా క్షిపణి శకలాలు పడటంతో ఆందోళన నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తులు 45 రోజుల కాల్పుల విరమణ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇరాన్ వార్ (Iran war) కారణంగా గ్లోబల్ ఆయిల్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. హోర్ముజ్ జలసంధి మూతపడితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటడం ఖాయం. ప్రస్తుతం ఇరాక్ చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు సరఫరాను మెరుగుపరిచినా.. అమెరికా విధించిన మంగళవారం గడువు ముగిసిన తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారతాయేమోనన్న భయం ఇన్వెస్టర్లలో నెలకొంది. శాంతి చర్చలు సఫలమైతే తప్ప ఈ ఇంధన యుద్ధానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ట్రంప్ కీలక ప్రకటన..చమురును అమెరికా నుండే కొనుగోలు చేయాలని ఆదేశాలు..

ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్ కుదేల్.. ఆస్తులు కాపాడుకోవడానికి పెట్టుబడిదారులకు కీలక సూచనలు ఇవిగో..

ఇరాన్ కథను వచ్చే వారంలో ముగిస్తాం.. ట్రంప్ సంచలన ప్రకటన.. బెదిరింపులపై ఇరాన్ ఏమందంటే..

Strait of Hormuz: సముద్రం మధ్యలో టోల్ గేట్! ప్రపంచానికి ఇరాన్ షాక్!

అమెరికాకు దిమ్మతిరిగి షాక్..హార్ముజ్ జలసంధిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న ఇరాన్..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications